సాయిపల్లవిపై మనసు పారేసుకున్న బాలీవుడ్‌ నటుడు | Gulshan Devaiah Says He Has Huge Crush On Sai Pallavi | Sakshi
Sakshi News home page

Gulshan Devaiah: 'సాయిపల్లవి అంటే చాలా ఇష్టం.. ఆమె నెంబర్‌ ఉంది, కానీ ఆ ధైర్యం లేదు'

Published Mon, May 29 2023 2:25 PM | Last Updated on Mon, May 29 2023 3:43 PM

Gulshan Devaiah Says He Has Huge Crush On Sai Pallavi - Sakshi

హీరోయిన్‌ సాయిపల్లవి క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేచురల్‌ బ్యూటీగా, లేడీ పవర్‌ స్టార్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. హిట్టూ, ఫ్లాపులతో సంబంధం లేకుండా స్టార్‌ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. డ్యాన్స్‌ స్టెప్పులతో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న సాయిపల్లవికి సౌత్‌లోనే కాదు, నార్త్‌లోనూ ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

ఈ క్రమంలో సాయిపల్లవిపై బాలీవుడ్‌ నటుడు గుల్షన్ దేవయ్య మనసు పారేసుకున్నాడు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. హీరోయిన్‌ సాయిపల్లవి అంటే తనకు చాలా ఇష్టమని, ఆమె తన క్రష్‌ అంటూ చెప్పుకొచ్చాడు. సాయిపల్లవి అందం, డ్యాన్స్‌కు ఫిదా అయిపోయానని, ఆమె నెంబర్‌ తన వద్ద ఉన్నా ఫోన్‌ చేసి మాట్లాడే ధైర్యం చేయలేకపోయానంటూ తన ప్రేమ గురించి వెల్లడించాడు.

'సాయిపల్లవి అద్భుతమైన నటి, డ్యాన్సర్‌. కొన్నిసార్లు ఆమె పట్ల ఇన్‌ఫాచ్యువేషన్‌కు లోనయ్యాను. ఎందుకో తెలియదు కానీ ఆమె సినిమాలన్నీ చూస్తాను. ఆమెపై నాకు ఎంత పిచ్చి అంటే జీవితంలో ఒక్కసారైనా ఆమెతో కలిసి పనిచేసే అవకాశం వస్తుందని అనుకుంటున్నా. అప్పుడు నా సంతోషానికి అవధులు ఉండవు' అంటూ గుల్షన్‌ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement