
ప్రముఖ చైనా మొబైల్ తయారీదారు వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 'వివో ఎక్స్21ఎస్' పేరిట చైనా మార్కెట్‌లో లాంచ్ చేసింది. వివో వీ11ప్రో ఫోన్ మాదిరిగా ఈ సరికొత్త 'ఎక్స్21ఎస్' ఫోన్‌లోనూ అమర్చింది. అయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ సెన్సార్, వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్, బెజెల్ లెస్ డిస్‌ప్లే, స్నాప్ డ్రాగన్ 660 వంటి అధునాతన ఫీచర్లు అదనంగా జోడించింది. దీని ధర సుమారు రూ.26,100గా వుండనుంది.
వివో ఎక్స్21ఎస్ ఫీచర్లు
6.41 ఫుల్ హెచ్‌డీ డిస్ప్లే
1080x2340 పిక్సెల్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్
6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
12+5 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరాలు
24.8 ఎంపీ సెల్ఫీ కెమెరా
3400ఎంఏహెచ్ బ్యాటరీ