
బీజింగ్: చైనీస్ మొబైల్ తయారీదారు సంస్థ వివో తాజాగా మరో ఆకర్షణీయమైన స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. పలు అంచనాల తరువాత చివరకు చైనాలో వివోఎక్స్ 20ప్లస్ యూడీ పేరుతో ఈ డివైస్‌ను లాంచ్ చేసింది. సినాప్టిక్స్ క్లియర్ ఐడీ 9500 అండర్- ఫింగర్ ప్రింట్ సెన్సర్ మోలెడ్ ప్యానెల్ దీని ప్రధాన ఆకర్షణగా కంపెనీ చెబుతోంది. అంతేకాదు ఈ ఫీచర్‌తో వస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇదేనని తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచి (సుమారుగా రూ .36,100) చైనా మార్కెట్లో విక్రయానికి లభ్యం. బ్లాక్ కలర్ విత్‌గోల్డెన్ ఫ్రేమ్‌తో లాంచ్ చేసింది. అయితే భారత్ సహా ఇతరమార్కెట్లలో ఎపుడు లభ్యమయ్యేది ఇంకా వెల్లడికాలేదు.
వివో ఎక్స్ 20 ప్లస్ యూడీ ఫీచర్లు
6.43 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 7.1 నౌగాట్
4జీబీ ర్యామ్
128జీబీ స్టోరేజ్
256 దాకా విస్తరించుకునే సదుపాయం
12+ 5ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా
12 ఎంపి సెల్ఫీ కెమెరా
3900ఎంఏహెచ్ బ్యాటరీని