సెన్సార్‌ పూర్తి చేసుకున్న వరుణ్ తేజ్‌ మట్కా.. రన్‌ టైమ్ ఎంతంటే? | Mega Hero Varun tej Latest Movie Matka Sensor Works Completed | Sakshi
Sakshi News home page

Matka Movie: సెన్సార్‌ పూర్తి చేసుకున్న వరుణ్ తేజ్‌ మట్కా.. రన్‌ టైమ్ ఎంతంటే?

Published Mon, Nov 11 2024 7:29 PM | Last Updated on Mon, Nov 11 2024 7:41 PM

Mega Hero Varun tej Latest Movie Matka Sensor Works Completed

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం మట్కా. ఈ ఫుల్ యాక్షన్ సినిమాకు కరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ సరసన గుంటూరు కారం భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది.

తాజాగా ఈ మూవీ సెన్సార్‌ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కాగా.. చాలా రోజులుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న మెగాహీరో వరుణ్ తేజ్.. ఈ సినిమాపై బోలెడన్ని ఆశలన్ని పెట్టుకున్నాడు. 'మట్కా' అనే గేమ్ నేపథ్యంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో వరుణ్ తేజ్ మూడు విభిన్న గెటప్స్‌లో వరుణ్ కనిపించనున్నాడు.

రన్‌ టైమ్ ఎంతంటే..

మట్కా రన్‌టైమ్‌ దాదాపు  2 గంటల 33 నిమిషాలుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. టైటిల్స్‌తో కలిసి దాదాపు 2 గంటల 39 నిమిషాల రన్‌టైమ్‌ ఉండనుంది. ఈ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌లో చివరి 20 నిమిషాలు క్లైమాక్స్‌ హైలెట్‌గా ఉండనుందని ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మేకర్స్ వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement