చెమటతో వ్యాధిని గుర్తించొచ్చు!
బోస్టన్: చెమటను పరీక్షించి రోగాన్ని గుర్తించే సరికొత్త సెన్సర్‌ను స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు.రిస్ట్ బ్యాండ్ రూపంలో ధరించేందుకు అనువుగా ఉండే ఈ సెన్సర్‌ద్వారా మధుమేహం, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి రోగాలు గుర్తించవచ్చు. ఈ సెన్సర్ చెమటను సేకరించి దానిలోని క్లోరైడ్, గ్లూకోజ్ అణువులను విశ్లేషించి రోగ నిర్ధారణ చేస్తుంది.
ఈ పరికరం వల్ల రోగ నిర్ధారణ కోసం గంటల తరబడి పరీక్షా కేంద్రాల్లో వేచిచూడాల్సిన అవసరం తప్పుతుంది. ఎలా కావాలంటే అలా వంచుకునే సౌలభ్యం ఉన్న ఈ సెన్సర్‌లో రెండంచెల వ్యవస్థ ఉంటుంది. ఇందులోని మైక్రోప్రాసెసర్ చర్మానికి అతుక్కుని ఉంటుంది.ఇది స్వేద గ్రంధులను ఉత్తేజపరిచి అందులోని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా చెమటలోని అణువులను విశ్లేషిస్తుంది.