ది గోట్‌ మూవీ.. రన్‌టైమ్ ఎన్ని గంటలో తెలుసా? | Kollywood Hero Vijay Latest Movie The Goat Run Time Here | Sakshi
Sakshi News home page

The Goat Movie: విజయ్ ది గోట్‌.. రన్‌ టైమ్ చూస్తే వామ్మో అనాల్సిందే!

Aug 28 2024 9:08 AM | Updated on Aug 28 2024 11:14 AM

Kollywood Hero Vijay Latest Movie The Goat Run Time Here

కోలీవుడ్ స్టార్‌ హీరో, దళపతి విజయ్ నటిస్తోన్న తాజా చిత్రం ది గోట్‌(ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌). ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా కనిపించనుంది. సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ ఫిల్మ్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రానికి వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని డైరెక్టర్‌ వెంకట్‌ ప్రభు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. గోట్‌ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసినట్లు వెల్లడించారు.

అయితే ఈ సందర్భంగా చిత్రబృందానికి కొన్ని మార్పులు చేయాలని సెన్సార్‌ బోర్డు సూచించింది. దీంతో గోట్ మూవీకి మరోసారి సెన్సార్‌ చేయాల్సి వచ్చింది.  సెన్సార్‌ బోర్డు ఆదేశాలతో ఓ లేడీ క్యారెక్టర్‌కు సంబంధించిన రియాక్షన్‌ షాట్‌ను తొలగించిన చిత్రబృందం.. రెండు సెకన్ల నిడివి ఉన్న షాట్‌ను మరో షాట్‌తో భర్తీ చేసింది. యూ/ఏ సర్టిఫికెట్‌ పొందిన ఈ సినిమా ఫైనల్‌ రన్‌టైమ్‌ 3.03 నిమిషాలుగా ఉంది. ప్రస్తుం దీనికి సంబంధించిన సెన్సార్ రిపోర్ట్స్‌ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

కాగా.. ఇప్పటికే రిలీజైన ది గోట్‌ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్‌ వస్తోంది. ఈ సినిమాలో విజయ్‌ని పాతికేళ్ల కుర్రాడిగా చూపించనున్నారు. ఈ మూవీలో విజయ్‌ తండ్రీ, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారు.  స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా కీలక పాత్రల్లో పోషించారు. తెలుగు, తమిళం, హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతమందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement