నో కట్స్‌ | No censor cuts for Guna 369 | Sakshi
Sakshi News home page

నో కట్స్‌

Published Fri, Jul 26 2019 12:24 AM | Last Updated on Fri, Jul 26 2019 12:24 AM

No censor cuts for Guna 369 - Sakshi

కార్తికేయ

ఒక్క కట్‌ కూడా లేకుండానే ‘గుణ’ సెన్సార్‌ పరీక్ష పాస్‌ అయి రిలీజ్‌కు రెడీ అయ్యాడు. కార్తికేయ హీరోగా నూతన దర్శకుడు అర్జున్‌ జంధ్యాల రూపొందించిన చిత్రం ‘గుణ 369’. అనఘ కథానాయిక. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆగస్ట్‌ 2న రిలీజ్‌ కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘సెన్సార్‌ బోర్డ్‌ వారు ఒక్క కట్‌ కూడా చెప్పలేదు.

మంచి సినిమా తీశామనే సంతృప్తి ఉంది. ట్రైలర్‌ చూసిన వాళ్లందరూ గ్యారెంటీ హిట్‌ అంటున్నారు. పాటలకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది’’ అన్నారు. ‘‘నాలుగు గోడల మధ్య రాసిన కథ కాదిది. యథార్థ గాథే మా చిత్రం ముడిసరుకు. సహజంగా ఉంటుంది. కథలో ఉన్న సహజత్వం ప్రేక్షకుడి గుండెను తాకుతుంది’’ అన్నారు అర్జున్‌ జంధ్యాల. ఈ చిత్రానికి సంగీతం: చేతన్‌ భరద్వాజ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: సత్య కిశోర్, శివ మల్లాల. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement