సరదా... సరదాగా... | bindhu madhavi new movie | Sakshi
Sakshi News home page

సరదా... సరదాగా...

Published Tue, Sep 8 2015 10:44 PM | Last Updated on Sun, Sep 3 2017 9:00 AM

సరదా... సరదాగా...

సరదా... సరదాగా...

రెండు ఊళ్ల మధ్య ఉన్న పగ, ప్రతీకారాలను ఓ యువకుడు ఎలా రూపుమాపాడన్న కథాంశంతో తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘దేశింగు రాజా’. విమల్, బిందుమాధవి జంటగా ఎళిల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘భల్లాల దేవ’ పేరుతో రావిపాటి సత్యనారాయణ అనువదించారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెలాఖరున విడుదల కానుంది.

నిర్మాత మాట్లాడుతూ-‘‘సరదా... సరదాగా అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంది. మన తెలుగమ్మాయి బిందుమాధవి చాలా రోజుల తరువాత ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కనువిందు చేయనుంది. ఈ నెల 12న పాటలను విడుదల చేయనున్నాం’’అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఇమాన్, సాహిత్యం: వనమాలి, మాటలు: కృష్ణతేజ.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement