
మేము ముందే పెళ్లి చేసుకున్నాం!
కాలిఫోర్నియా: అమెరికాలో జరిగిన పెళ్లి వేడుకకు ముందే ఏంజిలీనా జోలీ-బ్రాడ్ పిట్ ల జోడీ ఒక్కటైందట. గత సంవత్సరం ఆగస్టులో పిల్లల సమక్షంలో జరిగిన పెళ్లి తంతుకు ముందే తాము వివాహం చేసుకున్నట్లు హాలీవుడ్ నటి, దర్శకురాలు ఏంజిలీనా తాజాగా స్పష్టం చేసింది. 'ఒక రోజు ఫ్రాన్స్ లో నాలుగు గంటల సమయంలో బ్రాడ్ ను కలిశాను. తరువాత కొన్ని వివాహ పత్రాలపై ఇద్దరం సంతకాలు చేసి ఒక్కటయ్యాం' అని ఏంజలీనా తెలిపింది.
అయితే తాము ఫ్రాన్స్ లో చేసుకున్న వివాహం చట్టబద్ధంగా జరగకపోవడంవల్ల మరోసారి కాలిఫోర్నియాలో పెళ్లి చేసుకున్నామన్నామని తెలిపింది.