ఆమెతో డేటింగ్‌ చేస్తున్నాడు..! | Brad Pitt dating Angelina Jolie lookalike? | Sakshi
Sakshi News home page

ఆమెతో డేటింగ్‌ చేస్తున్నాడు..!

Oct 19 2017 3:59 PM | Updated on Oct 19 2017 3:59 PM

Brad Pitt dating Angelina Jolie lookalike?

హాలీవుడ్‌ నటుడు బ్రాడ్‌పిట్‌ మాజీ భార్య ఏంజెలినా జోలీకి దూరంగా ఉంటున్నాడు. జోలీతో విడాకులు అనంతరం ఆయన పలువురితో డేటింగ్‌ చేసినట్టు కథనాలు వచ్చాయి. హాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్న తాజా కథనం ప్రకారం బ్రాడ్‌‌.. ప్రముఖ నటి ఎల్లా పుర్నెల్‌తో ప్రేమలో మునిగిపోవాలని తపిస్తున్నాడట. అందుకు కారణం.. పుర్నెల్‌ అచ్చం ఏంజెలినా జోలీలాగే ఉండటమే.. 2014లో వచ్చిన 'మేల్‌ఫిసెంట్‌' సినిమాలో జోలీ చిన్నప్పటి పాత్రలో తను నటించింది.

21 ఏళ్ల ఎల్లా తాజాగా 'మిస్‌ పెరెగ్రిన్స్‌ హోమ్‌ ఫర్‌ పెక్యూలియర్‌ చిల్డ్రన్‌' సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఆమె నటన చూసి ఉప్పొంగిపోయిన పిట్‌.. ఆమెతో కలిసి పనిచేసేందుకు సిద్ధం అంటూ ఆఫర్‌ ఇచ్చాడు. బ్రాడ్‌ సొంత ప్రొడక్షన్‌ ప్లాన్‌ బీ నిర్మించనున్న 'స్వీట్‌ బిట్టర్‌'లో ఈ ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు. అప్పటినుంచి 53 ఏళ్ల బ్రాడ్‌ పిట్‌-21 ఏళ్ల ఎల్లా మధ్య అనుబంధం చిగిరిస్తోందని హాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.

'బ్రాడ్‌, ఎల్లా మధ్య అనుబంధం ఇప్పుడిప్పుడే మొదలవుతున్నది. ఆమెను ఈ సినిమాలో తీసుకోవడానికి బ్రాడ్ ఎంతో దూరం వెళ్లాడు. తన పట్ల బ్రాడ్‌ చూపుతున్న అభిమానం, ప్రత్యేక ఆకర్షణ ఎల్లాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బ్రాడ్‌ ఎప్పుడు తన నంబర్ వన్‌ సెలబ్రిటీ క్రష్‌ అని ఎల్లా స్నేహితులతో చెప్తోంది' అని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

అయితే, బ్రాడ్‌-ఎల్లా సన్నిహితంగా ముందుకు సాగుతుండటం మాజీ భార్య ఏంజెలినాకు ఏమాత్రం నచ్చడం లేదట. ఓ సినిమాలో తన చిన్నప్పటి పాత్ర పోషించిన అమ్మాయితో బ్రాడ్‌ సాన్నిహిత్యం నెరపడంపై ఆమె మండిపడుతున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. తమ కొడుకు మడోక్స్‌(16)కు కేవలం ఐదేళ్లు ఎక్కువ వయస్సున్న అమ్మాయితో అతను డేటింగ్‌ చేస్తుండటం.. పెద్ద తప్పు అని, వయస్సు వ్యత్యాసాన్ని అతను గుర్తించాలని జోలీ ఘాటుగా పేర్కొన్నట్టు తెలిసింది. అయితే, ఇవేమీ పట్టించుకోని బ్రాడ్‌.. ఒకవైపు తన తాజా సైన్స్‌-ఫిక్షన్ సినిమా 'యాడ్‌ అస్త్ర'లో పనిచేస్తూనే.. మరోవైపు ఎల్లాతో చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నాడని, ఆమె కోసం చాలా టైమ్‌ కేటాయించి దగ్గరవుతున్నాడని, తమ అనుబంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని అతను భావిస్తున్నాడని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement