
'వాళ్లు విడిపోయారుగా.. ఇక పెళ్లి చేసుకుంటా'
లాస్ ఎంజెల్స్: హాలీవుడ్ హాట్ కపుల్ బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ విడిపోవడంపై ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడేస్తున్నారు. హాలీవుడ్ నటి, కమెడియన్ చెల్సియా హ్యాండ్లర్ బ్రెంజిలీనాల(బ్రాడ్ పిట్, ఏంజెలినా) బ్రేకప్ పై స్పందిస్తూ ఏంజెలీనాను తప్పుబట్టింది. ఆమె చాలా వెర్రిదని, చపలచిత్తంగల స్త్రీ అని విమర్శించింది. ఎంతమంది పెళ్లి చేసుకున్నా వారు మాత్రం ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదని ఎప్పుడూ చెప్తుండే దాన్నని చెప్పింది. వాళ్లు పెళ్లి చేసుకున్నందున తిరిగి విడాకులు తీసుకునేవరకు తాను పెళ్లి చేసుకోబోనని చెప్పానని, ఇక వాళ్లు విడాకులు తీసుకుంటున్నందున నేను అధికారికంగా ఎవరైనా పెళ్లి ప్రతిపాదనలతో వస్తే అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది.
ప్రతి ఒక్కరు బ్రాడ్ నే విమర్శిస్తున్నారని, ఆయనే తాగుబోతు, సిగరెట్లు తాగుతాడని విమర్శిస్తున్నారని, ఒక వేళ ఏ కారణం లేకుండానే అతడు అలా మారిపోతాడా అని ఆమె ప్రశ్నించింది. ఎంజెలీనా మంచిదికాదని ఆమె ఓ వెర్రిమాలోకం అని వెక్కిరించింది. ఈ విమర్శలు చేసిన చెల్సియా బ్రాడ్ ఫిట్ మాజీ భార్య ఆనిస్టన్ స్నేహితురాలు. అంతకుముందు కర్మ సిద్ధాంత ప్రకారం వారు విడిపోయారని బ్రాడ్ ఫిట్ మాజీ భార్య జెన్నిఫర్ ఆనిస్టన్ పేర్కొనడమే కాకుండా బ్రాడ్‌కు జోలీ ఎంతమాత్రం సరిపోదని చెప్పింది. సాదాసీదాగా ఉండే బ్రాడ్‌కు జోలీ చాలా సంక్లిష్టమైన జోడీ అని చెప్పింది. వారిద్దరు విడిపోవడం సంతోషంగానే ఉందని చెప్పింది.కాగా, బాగా తాగి వచ్చిన బ్రాడ్ ఫిట్ పిల్లలపై చేయిచేసుకోవడం వల్లే ఎంజెలీనా విడిపోయినట్లు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.