మా పిల్లలు నటులు కారట: హీరోయిన్
సాధారణంగా డాక్టర్ల పిల్లలు డాక్టర్లు, లాయర్ల పిల్లలు లాయర్లు, నటీనటుల పిల్లలు కూడా అదే వారసత్వం పుచ్చుకోవడం మనకు తెలుసు. కానీ, హాలీవుడ్ హీరోయిన్ ఏంజెలినా జోలీ పిల్లలు మాత్రం తాము నటనా రంగంలోకి వెళ్లే ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టి మరీ చెప్పేస్తున్నారట. జోలీకి ఆరుగురు పిల్లులన్నారు.
వాళ్లు మాడాక్స్ (14), పాక్స్ (12), జహారా (11), షిలో (10), ఇద్దరు కవలలు వివెన్నె, నాక్స్ (7). అయితే ఈ ఆరుగురిలో ఎవరూ నటనా రంగంలోకి వెళ్లాలని అనుకోవట్లేదట. వాళ్లంతా సంగీతకారులు అవ్వాలనుకుంటున్నారని జోలీ చెప్పింది. బీబీసీ రేడియో కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె ఈ విషయం వెల్లడించింది. సినిమా బయటి నుంచే బాగుంటుందన్నది వాళ్ల అభిప్రాయమని, మాడాక్స్‌కు ఎడిటింగ్‌లోను, పాక్స్‌కు సంగీతం, డీజేయింగ్‌లోను ఆసక్తి ఉందని తెలిపింది. ఈ పిల్లలంతా కలిసి వాళ్లలో వాళ్లు ఏడు భాషలు నేర్చుకుంటున్నారట.