హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ
కోవిడ్ 19 (కరోనా వైరస్) కారణంగా ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డాయి. కొన్ని ప్రభుత్వ విద్యాలయాల్లో పిల్లలకు ఉచిత భోజన సౌకర్యం ఉంటుంది. ఇప్పుడు పాఠశాలలు మూతబడడంతో పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు సరైన ఆహారం అందే పరిస్థితి లేదు. అందుకే ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ ‘నో కిడ్ హంగ్రీ’ అనే సేవా సంస్థకు దాదాపు 7 కోట్లకు పైగా విరాళంగా ప్రకటించారు. ‘‘కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పిల్లలు స్కూల్‌కు వెళ్లలేకపోతున్నారు. చాలామంది పిల్లలకు స్కూల్ టైమింగ్స్‌లో పౌష్టికాహారం అందుతుంది. అమెరికాలోనే అలాంటి వారు 22 మిలియన్లు ఉన్నారు. అందుకే నా వంతుగా విరాళం ఇస్తున్నా. పిల్లలు పస్తులుండకూడదు’’ అని పేర్కొన్నారు ఏంజెలినా.
Comments
Please login to add a commentAdd a comment