వాళ్ల విడాకులపై మాజీ భార్య సంతృప్తి! | Jennifer Aniston comments on Angelina Jolie, Brad Pitt divorce | Sakshi
Sakshi News home page

వాళ్ల విడాకులపై మాజీ భార్య సంతృప్తి!

Published Wed, Sep 21 2016 5:20 PM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM

వాళ్ల విడాకులపై మాజీ భార్య సంతృప్తి!

వాళ్ల విడాకులపై మాజీ భార్య సంతృప్తి!

హాలీవుడ్‌లోనే ప్రముఖ జంటగా పేరొందిన బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ విడాకుల వార్త సహజంగానే ఇంటర్నెట్‌లో పెద్ద చర్చనీయాంశమైంది. భర్త బ్రాడ్‌తో విడాకులు తీసుకొనేందుకు కోర్టును జోలీ దరఖాస్తు చేసుకోవడంతో ఈ వార్తపై ఎన్నో కథనాలు వెలువడ్డాయి.

అయితే, జోలీ-బ్రాడ్‌ విడాకులపై బ్రాడ్‌ మాజీ భార్య, హాలీవుడ్‌ నటి జెన్నిఫర్‌ అనిస్టన్‌ వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రం ఆన్‌లైన్‌ను కుదిపేస్తున్నాయి. ఆమె వ్యాఖ్యలపై ఎన్నో జోకులు వెల్లువెత్తుతున్నాయి. యూఎస్‌ వీక్లీ మ్యాగజీన్‌ కథనం ప్రకారం జోలీ-బ్రాడ్‌ విడాకులపై అనిస్టన్‌ తన సన్నిహితులతో స్పందించింది. ’కర్మ’ సిద్ధాంతం ప్రకారమే వారు విడిపోయినట్టు ఆమె పేర్కొంది. అంతేకాదు జోలీతో బ్రాడ్‌ విడిపోతుండటంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేసింది.

11 ఏళ్ల వైవాహిక జీవితం.. అరడజనుకుపైగా పిల్లలతో అన్యోన్యమైన జంటగా పేరొందిన బ్రాడ్‌-జోలీ మధ్య ఏదో జరుగుతుందని తనకు ఎప్పుడూ అనిపించేదని ఆమె సన్నిహితులతో పేర్కొంది. ’ బ్రాడ్‌కు జోలీ ఎంతమాత్రం సరిపోదని అనిస్టన్‌ ఎప్పుడూ భావించలేదు. కానీ సాదాసీదాగా ఉండే బ్రాడ్‌కు జోలీ చాలా సంక్లిష్టమైన జోడీ అని ఆమె భావిం‍చేది’ అని సన్నిహితులు పేర్కొన్నారు. తన మాజీ భర్త వైవాహిక జీవితంపై అనిస్టన్‌కు ఎలాంటి దురభిప్రాయాలు లేవని, వారు విడిపోవాలని కానీ, కలిసుండాలని కానీ ఆమె కోరుకోలేదని చెప్పారు.

అయితే, బ్రాడ్‌-జోలీ విడిపోతుండటంపై ఆమె సంతృప్తిగా ఉందని వారు తెలిపారు. 2000 సంవత్సరంలో బ్రాడ్‌- అనిస్టన్‌ పెళ్లి చేసుకొని ఐదేళ్ల తర్వాత విడిపోయారు. అనంతరం 2011 నుంచి జస్టిన్‌ థిరౌక్స్‌తో డేటింగ్‌ చేసిన అనిస్టన్‌ 2015లో అతన్ని పెళ్లాడించింది. మరోవైపు పిట్‌-జోలీ విడాకులతో జెన్నిఫర్‌ అనిస్టన్‌ సంతోషంలో మునిగిపోయి పండుగ చేసుకుంటున్నదని ఆన్‌లైన్‌లో జోకులు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement