
ఏంజెలినా జోలి
ఏంజెలినా జోలి.. హాలీవుడ్‌లో స్టార్లకే స్టార్, సూపర్‌స్టార్! ఆరుగురు పిల్లలకు తల్లి. బ్రాడ్‌పిట్‌కు విడాకులిచ్చి, సంవత్సర కాలంగా పిల్లలను తానే పెంచుతోన్న ఏంజెలినా, క్రిస్మస్ కోసం పెద్ద ఎత్తునే ఏర్పాట్లు చేసుకుంటోంది. పిల్లలందరికీ బెస్ట్ టైమ్ క్రిస్మస్ కావడంతో వాళ్లను సంతోషపెట్టేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోందట. అయితే ఇంతవరకూ బాగానే ఉంది కానీ, ఇలా పిల్లలకు క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవ్వాలన్న ప్రయత్నంలో ఏంజెలినా జోలి డబ్బుల్లేక బాధపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
మిలియన్ల డాలర్ల డబ్బులున్న ఏంజెలినా పిల్లలకు గిఫ్ట్‌లు కొనడానికి డబ్బుల్లేక బాధపడుతుందా? అని ఎవరన్నా అంటే.. అందుకు ఆమె ‘టార్గెట్’ స్టోర్‌లో కనిపించడాన్ని చూపిస్తూ తమ వాదనను సమర్థించుకుంటున్నారు కొందరు. అమెరికాలో డిస్కౌంట్‌లో బట్టలు అమ్మే పెద్ద స్టోర్ టార్గెట్. ఏంజెలినా దగ్గర డబ్బులే ఉంటే టార్గెట్‌లో, డిస్కౌంట్‌లో షాపింగ్ ఎందుకు చేయాలి? అన్న వాదనలు కొన్ని వచ్చాయి. ఇందులో నిజం లేదని ఇంకొందరు అంటారు. టార్గెట్ ఏంజెలినాకు ఫేవరెట్ ప్లేస్ అని, అలా అక్కడికి వెళ్లి ఉండొచ్చని వీరంటారు. కాదు.. కాదు బ్రాడ్‌పిట్‌తో ఆస్తి గొడవ ఇంకా తేలక ఏంజెలినా డబ్బుల్లేక కష్టాల్లో ఉన్నారని వారంటారు. ఎవరేమన్నా ఏంజెలినా దగ్గర డబ్బుల్లేవంటే ఎవ్వరూ నమ్మరని సగటు సినీ అభిమాని అంటాడు. చివరిదే నిజమై ఉండొచ్చు!!
Comments
Please login to add a commentAdd a comment