హాట్ కపుల్‌ మళ్లీ కలుస్తున్నారా? | Angelina Jolie and Brad Pitt Re Unite Again | Sakshi

హాట్ కపుల్‌ మళ్లీ కలుస్తున్నారా?

Aug 11 2017 3:33 PM | Updated on Sep 17 2017 5:25 PM

హాట్ కపుల్‌ మళ్లీ కలుస్తున్నారా?

హాట్ కపుల్‌ మళ్లీ కలుస్తున్నారా?

బ్రేకప్‌లు, మళ్లీ రిలేషన్లు కామన్‌ అయిపోతున్న ఈ రోజుల్లో హాలీవుడ్ హాట్‌ జంట బ్రాడ్ పిట్‌, ఏంజెలీనా జోలీ తమ 12 ఏళ్ల బంధాన్ని తెంచేసుకుంటున్నట్లు ప్రకటించి వార్తల్లో నిలిచారు.

బ్రేకప్‌లు, మళ్లీ రిలేషన్లు కామన్‌ అయిపోతున్న ఈరోజుల్లో హాలీవుడ్ హాట్‌ జంట బ్రాడ్ పిట్‌, ఏంజెలీనా జోలీ తమ 12 ఏళ్ల బంధాన్ని తెంచేసుకుంటున్నట్లు ప్రకటించి వార్తల్లో నిలిచారు. అయితే విడాకుల ప్రక్రియను నిలిపివేయాలని జోలీ కోరటంతో ఆమె మనసు మార్చుకుని భర్తతో జీవించేందుకు సిద్ధమైపోయిందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ ప్రముఖ అమెరికన్‌ మ్యాగజైన్‌ కథనం ప్రచురించింది. బ్రాడ్ చేసిన తప్పులను క్షమించేసి తిరిగి అతనితో జీవించేందుకు ఇప్పటికే జోలీ రాయబారం మొదలు పెట్టిందని దాని సారాంశం. తమ ఆరుగురు పిల్లల సంరక్షణను బ్రాడ్ పట్టించుకోవట్లేదన్న కారణం చెప్పినప్పటికీ, మరో యువతితో 52 ఏళ్ల బ్రాడ్ మరో యువతితో అఫైర్‌ మూలంగానే విడాకులు దారితీసినట్లు హాలీవుడ్లో ఓ టాక్.

బ్రాడ్తో విడిపోయాక వేరే ఇంటికి మకాం మార్చిన 42 ఏళ్ల జోలీ అతనిపై ప్రేమను చంపుకోలేక చెడు వ్యసనాలకు బానిసయ్యిందని, అంతేకాకుండా పిల్లల భవిష్యత్తు కోసమే తిరిగి భర్తకు చేరువయ్యేందుకు యత్నిస్తోందని, ఈ విషయాన్ని బంధువులు కూడా ధృవీకరించినట్లు ఆ కథనం చెబుతోంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement