మనుషులే కాదు..బొమ్మలూ విడిపోయాయ్! | Angelina Jolie files for divorce from Brad Pitt | Sakshi
Sakshi News home page

మనుషులే కాదు..బొమ్మలూ విడిపోయాయ్!

Published Fri, Sep 23 2016 12:22 AM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM

మనుషులే కాదు..బొమ్మలూ విడిపోయాయ్!

మనుషులే కాదు..బొమ్మలూ విడిపోయాయ్!

 హాలీవుడ్ హాట్ కపుల్ బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ విడిపోతున్నారు. పన్నెండేళ్ల ప్రేమానుబంధం, రెండేళ్ల వివాహ బంధానికి ఈ జంట ముగింపు పలికేశారు. పుష్కర కాలం క్రితం ప్రేమలో పడ్డ ఈ నటుడు, నటి రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. హాలీవుడ్‌లో ఉన్న చూడ చక్కని జంటల్లో ఈ జంట ఒకటి. ఇద్దరి మధ్య సరిచేసుకోలేనంతగా మనస్పర్థలు నెలకొనడంవల్లే విడిపోవాలని నిర్ణయించుకున్నామని ఈ జంట పేర్కొంది.
 
  విడాకులకు కూడా అప్లై చేసుకున్నారు. మనషులే విడిపోతున్నప్పుడు ఈ ఇద్దరి బొమ్మలు మాత్రం ఎందుకు కలిసి ఉండాలని లండన్‌లోని మేడమ్ తుస్సాడ్స్ నిర్వాహకులు భావించినట్లు ఉన్నారు. ప్రముఖుల మైనపు బొమ్మలు తయారు చేసి ఈ మ్యూజియమ్‌లో పెడుతుంటారు. 2013లో పిట్, జోలీల బొమ్మలు తయారు చేయించి, ప్రదర్శనకు ఉంచారు.
 
  ఇప్పుడు ఈ ఇద్దరూ విడిపోతున్నామని ప్రకటించిన నేపథ్యంలో తుస్సాడ్స్ వారు బొమ్మలను కూడా విడగొట్టేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ‘‘బ్రాడ్ పిట్, ఏంజెలినాలు విడిపోతున్న విషయం చాలామందిని షాక్‌కి గురి చేసిన నేపథ్యంలో వాళ్లిద్దర్నీ (బొమ్మలను) మేం అఫీషియల్‌గా విడగొట్టేశాం’’ అని సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement