
ఏంజలీనా జోలీ
లాస్ ఏంజిలెస్: ప్రముఖ హాలీవుడ్ నటి, ఆస్కార్ విజేత ఏంజలీనా జోలీకి రాజకీయాలపై గాలి మళ్లింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. మానవతావాదిగా, ఐక్యరాజ్య సమితి ప్రత్యేక రాయబారిగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చారిటీ సంస్థలకు ఆమె సహాయ సహకారాలు అందిస్తున్నారు. తాను చేపడుతున్న మానవతావాద కార్యక్రమాలే రాజకీయాలపై తన ఆసక్తిని పెంచాయని ఏంజలీనా తెలిపారు. రాజకీయాలను కెరీర్‌గా ఎంచుకుంటారా? అన్న ప్రశ్నికు, అందుకు తాను సుముఖంగానే ఉన్నట్లు తెలిపారు.
మానవతావాదిగా పనిచేసేవారు, సమాజంలో సమూల మార్పులు తీసుకురావాలనుకునే వారు రాజకీయాలలోకి రావాలని అనుకుంటారన్నారు. అయితే తన రాజకీయ ఆకాంక్షకు సినీ కెరీర్ అవరోధం కావచ్చన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. సమాజంలో తాను ఏ పాత్రను పోషించడం ద్వారా మరింత ప్రయోజనం చేకూర్చగలనో తనకైతే ఇప్పటికి తెలియదన్నారు. అయితే తన జీవనోపాధి (సినీ రంగం) వల్ల తన ఆకాంక్ష సాధ్యమయ్యే అవకాశం తక్కువగా ఉందని మాత్రం ఆమె పేర్కొన్నారు.
**