తిండితిప్పలు మాని చైన్ స్మోకరైన ఏంజెలీనా
లాస్ ఏజెంల్స్ : ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలి పొగరాయుడిగా మారింది. ప్యాకెట్ల కొద్ది సిగరెట్లను కాజేస్తుంది. ఇటీవలె బ్రాడ్ ఫిట్తో తన వివాహ బందం బద్థలవడంతో ఆ వేదనను భరించలేక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై తిండి తిప్పలు మానేసి సిగరెట్లను ఒక వ్యసనంగా మార్చుకుంది. ఈ విషయం అక్కడి ఓ ఆంగ్ల వెబ్ సైట్ పేర్కొంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ తన భర్త బ్రాడ్ ఫిట్తో విడాకులు తీసుకున్నారు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన ఏంజేలీనా, చైన్ స్మోకర్గా మారినట్టు ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
క్యాన్సర్ బారినపడకుండా ఇప్పటికే ఆమె పలు సర్జరీలు చేయించుకున్న ఏంజెలీనా తిండితిప్పలు మాని రోజుకు రెండు సిగరెట్ ప్యాకెట్లు తాగుతుండటాన్ని నమ్మలేకపోతున్నామని వారు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.. '' ఏంజెలీనా అసలు తిండి ముట్టుకోవడం లేదు. విపరీతంగా సిగరెట్లు తాగుతోంది. ఈజీగా రోజుకు రెండు ప్యాకెట్లను పీల్చేస్తుంది'' అని ఏస్షోబిజ్.కామ్ రిపోర్టు చేసింది.