
ఎట్టకేలకు జోలీ పెళ్లి
హాలీవుడ్ జంట ఏంజెలినా జోలీ, బ్రాడ్‌పిట్ ఎట్టకేలకు వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. తొమ్మిదేళ్లుగా సహజీవనం చేస్తున్న వీరు శనివారం ఫ్రాన్స్‌లో కుటుంబసభ్యులు, సొంత బిడ్డలు, సన్నిహితుల మధ్య రహస్యంగా వివాహం చేసుకున్నారు.
లాస్ ఏంజెలిస్: హాలీవుడ్ జంట ఏంజెలినా జోలీ, బ్రాడ్‌పిట్ ఎట్టకేలకు వైవాహిక బంధం తో ఒక్కటయ్యారు. తొమ్మిదేళ్లుగా సహ జీవనం చేస్తున్న వీరు శనివారం ఫ్రాన్స్‌లో కుటుంబసభ్యులు, సొంత బిడ్డలు, సన్నిహితుల మధ్య రహస్యంగా వివాహం చేసుకున్నారు. జోలీ(39)కి మూడో వివాహం కాగా, బ్రాడ్‌పిట్(50)కి రెండోది. వీరిద్దరూ ఒక ఆడపిల్ల, ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. మరో ఆడపిల్ల, ఇద్దరు మగపిల్లలను దత్తత తీసుకున్నారు. 2005లో ‘మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్’ సినిమాలో తొలిసారిగా కలిసి నటించిన తర్వాత ఇన్నేళ్లకు మళ్లీ ‘బై ద సీ’ సినిమాలో జతకడుతున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది జోలీయే.