హిందూపురం: ప్రేమకు హద్దులు లేవని ఓ జంట నిరూపించింది. ఫ్రాన్స్ దేశస్తురాలైన ఆడ్ సవివ్, శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గొల్లపల్లికి చెందిన గొల్లసందీప్ యాదవ్ శుక్రవారం మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం హిందూ సంప్రదాయ పద్ధతిలో హిందూపురంలో ఘనంగా జరిగింది.
గొల్లపల్లికి చెందిన సామాన్య రైతు కేశప్ప, గంగమ్మ 11వ సంతానమైన సందీప్ యాదవ్ ఫ్రాన్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సీఎన్‌ఆర్‌లో సైంటిస్ట్‌గా స్థిరపడ్డారు. అక్కడ గూగుల్ సంస్థలో పనిచేస్తున్న ఫ్రాన్స్ దేశస్తురాలు ఆడ్ సవివ్‌తో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు అంగీకారం తెలిపాయి. దీంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకున్నారు. సందీప్ యాదవ్ అన్న ‘అక్షరమాల’ శ్రీనివాసులు పెళ్లి పెద్దగా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment