ఆస్కార్ రావాలి! | Angelina Jolie talks 'Unbroken' and her brilliant new star, Jack O'Connell | Sakshi
Sakshi News home page

ఆస్కార్ రావాలి!

Published Sat, Nov 29 2014 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 5:17 PM

ఆస్కార్ రావాలి!

ఆస్కార్ రావాలి!

హాలీవుడ్ హాట్ లేడీ ఏంజెలినా జోలీలో మంచి దర్శకురాలు కూడా ఉన్నారు. మూడేళ్ల క్రితం ‘ఇన్ ది ల్యాండ్ ఆఫ్ బ్లడ్ అండ్ హనీ’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారామె. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించినప్పటికీ, జోలీ డెరైక్షన్‌కి మంచి పేరొచ్చింది. తాజాగా ఆమె ‘అన్‌బ్రోకెన్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు రావాలని కోరుకుంటున్నారామె. ఉత్తమ సహాయ నటిగా గతంలో ఆస్కార్ అందుకున్నారు జోలీ. కాబట్టి, ఆస్కార్ అనుభూతి ఆమెకు కొత్త కాదు.

కానీ, ‘అన్‌బ్రోకెన్’కు ఎందుకు ఆస్కార్ దక్కాలనుకుంటున్నారో ఏంజెలినా చెబుతూ -‘‘రెండో ప్రపంచ యుద్ధంలో సైనికులకు చిక్కి, జైలు శిక్ష అనుభవించి, ఆ తర్వాత అందులో నుంచి బయటపడిన క్రీడాకారుడు లూయిస్ జంపెరిని జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రమిది. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచినజంపెరిని జీవితాన్ని తెరపై ఆవిష్కరించడానికి చాలా శ్రమపడ్డాను. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు వస్తే ఆ శ్రమకు తగిన ప్రతిఫలం దక్కినట్లు అవుతుంది’’ అని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement