జేమ్స్ బాండ్ 25వ చిత్రంగా వచ్చింది 'నో టైమ్ టు డై'. జేమ్స్ బాండ్‌గా డేనియల్ క్రేగ్ నటించిన ఈ చివరి మూవీకి క్యారీ జోజీ ఫుకునాగా దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ డైరెక్టర్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటివరకు క్యారీపై ముగ్గురు మహిళలు తమపట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు చేశారు. తనతో లైంగిక సంబంధం కోసం ఒత్తిడి చేశాడని 18 ఏళ్ల అమ్మాయి గతవారం మొదటిసారిగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. క్యారీతో దిగిన సెల్ఫీని పంచుకుంటూ 'నాకు గతిలేక 30 ఏళ్ల క్యారీతో లైంగిక సంబంధం కొనసాగించాను. అతను రోజు నాతో పడకసుఖం అనుభవించేవాడు. అతనికి భయపడుతూనే సంవత్సరాలు గడిపాను' అని తెలిపింది.
అయితే తమ రిలేషన్‌షిప్ గురించి ఎవరైనా అడిగితే అందరిముందు తన మేనకోడలు, బంధువు లేదా సోదరిగా నటించమని క్యారీ చెప్పాడని ఆమె పేర్కొంది. తన గురించి ఎవరికీ నిజం చెప్పేవాడు కాదని రాసుకొచ్చింది. అతనితో మూడు సంవత్సరాలు గడిపిన తర్వాత ఆ రిలేషన్ నుంచి బయటపడ్డానని, తనకు పీటీఎస్‌డీ ఉన్నట్లు గుర్తించి ఒక సంవత్సరం పాటు చికిత్స తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే మరో ఇద్దరు మహిళలు సైతం క్యారీపై లైంగిక ఆరోపణలు చేశారు. '20 ఏళ‍్ల వయసు ఉన్నప్పుడు క్యారీ డైరెక్ట్ చేసిన ఒక షోలో కలిసి పనిచేశాం. ఆ సమయంలో అతడు మూడేళ్లుగా మమ్మల్ని లైంగికంగా వేధించాడు. ఓ సారైతే క్యారీ ఇంటికి వచ్చి, అక్కడ ముగ్గురం కలిసి బెడ్ షేర్ చేసుకుందామని అడిగాడు. దానికి మేము ఒప్పుకోలేదు' అని ఆ ఇద్దరు నటీమణులు ఫేస్‌బుక్‌లో సంయుక్త ప్రకటన ద్వారా తెలిపారు. అయితే ఈ ఆరోపణలపై డైరెక్టర్ క్యారీ జోజీ ఇప్పటివరకు స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment