Guardians Of The Galaxy Director James Gunn Wants To Work With Jr NTR - Sakshi
Sakshi News home page

తారక్‌తో ఓ సినిమా చేయాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన హాలీవుడ్‌ దర్శకుడు

Published Wed, Apr 26 2023 2:26 PM | Last Updated on Wed, Apr 26 2023 3:57 PM

Guardians Of The Galaxy Director James Gunn Wants To Work With Jr NTR - Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ల రేంజ్‌ పెరిగిపోయింది. హాలీవుడ్‌ నుంచి కూడా ఈ హీరోలకు పిలుపు వస్తోంది. తాజాగా హాలీవుడ్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ గన్‌ తారక్‌తో కలిసి పని చేయాలని ఉందని మనసులోని మాట బయటపెట్టాడు.  ఇటీవల ఓ ఇంటర్వ్యూకి హాజరైన ఆయనకు ఏ ఇండియన్‌ స్టార్‌తో మీరు కలిసి పని చేయాలనుకుంటున్నారు? అన్న ప్రశ్న ఎదురైంది.

దీకి జేమ్స్‌ మాట్లాడుతూ.. 'గతేడాది బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఆర్‌ఆర్‌ఆర్‌లో సూపర్‌గా కనిపించిన ఆ హీరో ఎవరు? అతడి పేరు ఏంటి? పులులతో కలిసి బోనులో నుంచి ఓ వ్యక్తి బయటకు వస్తాడు కదా! అతడితో కలిసి పని చేయాలనుంది. తను చాలా అద్భుతంగా నటించాడు. ఫిదా అయిపోయా. అతడికి ఎలాంటి పాత్ర ఇవ్వాలనేదాని గురించి ఆలోచించడానికి కొంత సమయం పడుతుంది' అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే జేమ్స్‌ గన్‌.. గార్డియన్స్‌ ఆఫ్‌ ది గెలాక్సీ సినిమాలతో ఎక్కువ పాపులర్‌ అయ్యాడు. అతడు డైరెక్ట్‌ చేసిన గార్డియన్స్‌ ఆఫ్‌ ద గెలాక్సీ వాల్యూమ్‌ మూడో సీక్వెల్‌ మే 5న రిలీజ్‌ కానుంది.

కాగా ఎన్టీఆర్‌ ప్రస్తుతం హృతిక్‌ రోషన్‌ 'వార్‌ 2' మూవీలో నటించేందుకు సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే తారక్‌ కెరీర్‌లో సూపర్‌ హిట్‌గా నిలిచిన సింహాద్రి సినిమాను ఆయన పుట్టినరోజు సందర్భంగా మే 20న రీరిలీజ్‌​ చేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్‌ స్క్రీన్‌ అయిన ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌లో సింహాద్రిని ప్రదర్శించబోనున్నారు.

చదవండి: మైసూర్‌ నవాబ్‌ మనవరాలిని సజీవ సమాధి చేసిన భర్త

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement