NTR 30 Update Out: Brad Minnich Joins NTR 30 Movie As VFX Supervisor - Sakshi
Sakshi News home page

NTR30: ప్రముఖ హాలీవుడ్‌ టెక్నిషియన్‌ రంగంలోకి దింపిన కొరటాల, వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స్‌..

Published Wed, Mar 29 2023 9:00 AM | Last Updated on Wed, Mar 29 2023 9:41 AM

Hollywood Technician Brad Minnich Joins in NTR30 Movie Set - Sakshi

జూనియర్‌ ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ 30 అనే వర్కింగ్‌లో టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవలె పట్టాలెక్కింది. ఈ క్రమంలో తాజాగా NTR30కి సంబంధించి ఓ ఆసక్తికర అప్‌డేట్‌ను వదిలారు మేకర్స్‌. ఇప్పటికే ఈ సినిమాకు హాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ కెన్నీ బెట్స్‌ వర్క్స్‌ చేస్తున్న విషయ తెలిసిందే.

చదవండి: బర్త్‌డే రోజున చరణ్‌ ధరించిన ఈ షర్ట్‌ ధరెంతో తెలుసా?

తాజాగా ఈ సినిమాకు మరో హాలీవుడ్‌ సాంకేతిక నిపుణుడు బ్రాడ్‌ మిన్నిచ్‌ వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌ వైజర్‌గా వర్క్‌ చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. హాలీవుడ్‌ చిత్రాలు ‘300’, ‘ఆక్వామేన్‌’, ‘ది బ్యాట్‌మేన్‌’ వంటి వాటికి వర్క్‌ చేశారు బ్రాడ్‌ మిన్నిచ్‌. కాగా ఈ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా చేస్తున్న సంగతి తెలిసిందే. కల్యాణ్‌రామ్, కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్‌ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement