NTR30: Director Koratala Siva Reveals Jr NTR And Janhvi Kapoor NTR30 Movie Story Line - Sakshi
Sakshi News home page

NTR30: వేడుకగా ప్రారంభోత్సవం.. స్టో‍రీ చెప్పేసిన కొరటాల

Published Thu, Mar 23 2023 12:38 PM | Last Updated on Thu, Mar 23 2023 12:56 PM

NTR30: Koratala Siva Revealed Movie Backdrop At Movie Launch Event - Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కొత్త సినిమా మొదలైంది. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత తారక్‌ నటించబోయే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై హైదరాబాద్‌లోని స్టార్‌ హోటల్‌లో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమౌళి పాల్గొన్ని ఎన్టీఆర్‌, జాన్వీకపూర్ల ముహుర్తంపు సన్నివేశానికి క్లాప్‌ కొట్టారు.

చదవండి: జూనియర్‌తో శ్రీదేవి కూతురు జాన్వీ.. ముఖ్య అతిథిగా జక్కన్న.. ఫొటో వైరల్‌

అలాగే ప్రశాంత్‌ నీల్‌, ప్రకాశ్‌ రాజ్‌, సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచంద్రన్‌, కల్యాణ్‌రామ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టంట వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే ఈ మూవీ పూజ కార్యక్రమం అనంతరం నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి.. చిత్రబృందానికి స్క్రిప్ట్‌ను అందజేశారు. ఇదిలా ఉంటే పూజ అనంతరం కొరటాల శివ మాట్లాడుతూ స్క్రిప్ట్‌ గురించి హింట్‌ ఇచ్చారు. ‘‘జనతా గ్యారేజ్‌’ తారక్‌తో కలిసి మరోసారి వర్క్‌ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా.

చదవండి: అప్పుడు సో కాల్డ్‌ అంటూ కామెంట్స్‌.. ఇప్పుడు ఏకంగా మాజీ ప్రియుడుకి క్రెడిట్‌..

విస్మరణకు గురైన ఓ తీర ప్రాంత బ్యాక్‌డ్రాప్‌లో దీన్ని రూపొందిస్తున్నాం. ఈ కథలో మనుషుల కంటే ఎక్కువగా మృగాళ్లు ఉంటారు. భయం అంటే ఏమిటో వాళ్లకు తెలియదు. దేవుడంటే భయం లేదు. చావు అంటే భయం లేదు. కానీ.. వాళ్లకు ఒకే ఒక్కటంటే భయం. ఆ భయమేంటో మీకు తెలిసే ఉంటుంది. ఇదే ఈ సినిమా బ్యాక్‌డ్రాప్‌. భయం ఉండాలి. భయం అవసరం. భయపెట్టడానికి ప్రధాన పాత్ర ఏ స్థాయికి వెళ్తుందనేది.. ఒక ఎమోషనల్‌ రైడ్‌. దీన్ని భారీ స్థాయిలో తీసుకువస్తున్నాం. నా కెరీర్‌లో ఇది బెస్ట్‌ అవుతుందని అందరికీ మాటిస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement