HCA on Twitter: The award send to Jr NTR, Alia Bhatt next week - Sakshi
Sakshi News home page

Jr NTR-HCA Award: వచ్చే వారం ఎన్టీఆర్‌కు అవార్డు పంపిస్తున్నాం: హెచ్‌సీఏ అవార్డు సంస్థ

Published Fri, Mar 3 2023 12:13 PM | Last Updated on Fri, Mar 3 2023 12:44 PM

HCA Tweet that Award Send to Jr NTR And Alia Bhatt Next Week - Sakshi

జూనియర్‌ ఎన్టీఆర్‌పై తాజాగా హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) అవార్డు ఆసక్తికర ట్వీట్‌ చేసింది. హెచ్‌సీఏపై తారక్‌ ఫ్యాన్స్‌ కొద్ది రోజులుగా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్‌ చిత్రానికి పలు విభాగాల్లో హెచ్‌సీఏ అవార్డు ప్రకటించగా.. అందులో తారక్‌ పేరు లేకపోవడం వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌కు అవార్డును ఇవ్వకపోవడం హెచ్‌సీఏపై ట్విటర్‌ వేదికగా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ క్రమంతో దిగొచ్చ హెచ్‌సీఏ ఎన్టీఆర్‌కు కూడా అవార్డు ఇచ్చినట్లు తాజాగా ఓ ట్వీట్‌ చేసింది.

చదవండి: కాబోయే భార్య ఫొటో షేర్‌ చేసిన మంచు మనోజ్‌

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి గానూ ఎన్టీఆర్‌, అలియా భట్‌కు వచ్చేవారం ‘హెచ్‌సీఏ’ అవార్డులను పంపిస్తున్నాం’ అని తెలుపుతూ శుక్రవారం ఉదయం హెచ్‌సీఏ ట్వీట్‌ చేసింది. ఈ సందర్భంగా పేర్లతో ఉన్న ట్రోఫీల ఫొటోలను షేర్‌ చేసింది. దీంతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్వీట్‌పై నందమూరి ఫ్యాన్స్‌ రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా హాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ ఫిల్మ్స్ 'బ్లాక్ పాంథర్', 'బ్యాట్ మ్యాన్', 'ది విమెన్ కింగ్', 'టాప్ గన్ మేవరిక్' సినిమాలను వెనక్కి నెట్టి మరీ ‘ఆర్ఆర్ఆర్‌’ మూవీ ఈ అవార్డు వేడుకలో విజేతగా నిలిచింది.

చదవండి: సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ హీరో కన్నుమూత

ఏకంగా ఐదు విభాగాల్లో ఆర్‌ఆర్‌ఆర్‌కు ఈ ప్రతిష్టాత్మక అవార్డులు దక్కడం విశేషం. ఈ అవార్డును అందుకోవడానికి రాజమౌళి, హీరో రామ్ చరణ్, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, రాజమౌళి తనయుడు కార్తికేయ హాజరయ్యారు. కానీ ఎన్టీఆర్‌ మాత్రం మిస్‌ అయ్యారు. అప్పటి నుంచి హెచ్‌సీఏ అవార్డు నిర్వహకులపై ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అసహనం వ్యక్తం చేశారు. తమ హీరోకు ఎందుకు అవార్డు ఇవ్వలేదని ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు. దీంతో దిగొచ్చిన హెచ్‌సీఏ తాము ఆహ్వానం అందించామని, కానీ పర్సనల్‌ కారణాల వల్లే ఈవెంట్‌కు హాజరుకాలేదని హెచ్‌సీఏ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement