ఆర్ఆర్ఆర్ చిత్రం మరో ఘనత.. ప్రతిష్ఠాత్మక అవార్డులు కైవసం | RRR Movie wins Spotlight Award at Hollywood Critics Association | Sakshi
Sakshi News home page

RRR Movie: ఆర్ఆర్ఆర్ ప్రభంజనం..హాలీవుడ్‌లో రెండు అవార్డులకు ఎంపిక

Published Tue, Dec 6 2022 8:27 PM | Last Updated on Tue, Dec 6 2022 9:16 PM

RRR Movie wins Spotlight Award at Hollywood Critics Association - Sakshi

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్. బాక్సాఫీస్ వద్ద  ఆ మూవీ  ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం జపాన్‌లోనూ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అక్టోబర్ 21న జపాన్‌లో విడుదలైన 'ఆర్ఆర్ఆర్' పలు రికార్డులు సృష్టించింది. ఈ చిత్రం అంతర్జాతీయ అవార్డుల పరంపరను కొనసాగిస్తోంది. తాజాగా మరో రెండు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది. 

ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (HCA)లో స్పాట్‌లైట్ అవార్డును కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ టీం ట్విటర్ ద్వారా వెల్లడించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న లాస్ ఏంజెల్స్‌లో జరగనున్న 6వ హెచ్‌సీఏ  ఫిల్మ్ అవార్డ్స్‌లో ఈ అవార్డును అందజేయనున్నారు. మరోవైపు అట్లాంటా ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌ అవార్డ్స్‌’ ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగానూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఎంపికైంది. ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ‘సన్‌సెట్‌ సర్కిల్‌’, ‘శాటర్న్‌’ అవార్డులూ గెలుచుకుంది.

ఇటీవల.. న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌ (ఎన్‌.వై.ఎఫ్‌.సి.సి) పురస్కారాల్లో ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ఎంపికయ్యారు. ఇండియాలో సంచలనం సృష్టించిన ఈ సినిమా విదేశాల్లోనూ విడుదలై సత్తా చాటింది. కొమురం భీమ్‌, అల్లూరి సీతారామరాజు జీవితాల్ని స్ఫూర్తిగా తీసుకుని ఓ కల్పిత కథతో రూపొందించిన ఈ సినిమాలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ అద్భుతంగా నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement