Iran Zombie Angelina Jolie Sahar Tabar Reveals Real Face - Sakshi
Sakshi News home page

దెయ్యంలాంటి రూపంతో ఫేమస్‌.. అసలు ముఖం మాత్రం ఇది!

Published Thu, Oct 27 2022 6:09 PM | Last Updated on Thu, Oct 27 2022 6:43 PM

Iran Zombie Angelina Jolie Sahar Tabar Reveals Real Face - Sakshi

హాలీవుడ్‌ నటి ఏంజెలీనా జోలిని పోలిన ముఖ కవళికలతో.. ఓవరాల్‌గా భయంకరమైన రూపంతో సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ ఆ మధ్య ఫేమస్‌ అయ్యింది ఒక యువతి(21). అయితే  ఎట్టకేలకు ఆమె తన ముఖాన్ని ప్రపంచానికి చూపెట్టింది. అదీ జైలు నుంచి విడుదలైన తర్వాతే!. 

ఇరాన్‌కు చెందిన సహర్‌ తబర్‌.. 2019లో అరెస్ట్‌ అయ్యి జైలుకు వెళ్లింది. ఎంజెలీనా జోలిలా మారాలనే ఆశతో సర్జరీలు చేయించుకుంటే.. అవి వికటించిన వికృతంగా మారినట్లు తబర్‌పై ఓ ప్రచారం ఉండేది. ఆపై జరిగిన పరిణామాలు ఆమెను చిక్కుల్లో పడేశాయి. మోసం, దైవదూషణ నేరానికిగానూ ఆమెకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది అక్కడి న్యాయస్థానం. హిజాబ్‌ను అవమానించిన ఆరోపణలకుగానూ ఆమె ఈ శిక్ష పడింది.  అయితే.. 14 నెలలకే ఆమెకు జైలు జీవితం నుంచి విముక్తి లభించింది. అందుకు కారణం.. 40 రోజులుకు పైగా అక్కడ మహిళా లోకం చేస్తున్న పోరాటం.

మహ్‌సా అమినీ మృతి తర్వాత.. ఇరాన్‌లో ఉవ్వెత్తున్న హిజాబ్‌ వ్యతిరేక ఉద్యమం జరుగుతోంది. ఇదే అదనుగా సహర్‌ తబర్‌ను సైతం విడుదల చేయాలంటూ పలువురు సోషల్‌ మీడియాలో నినదించారు. మసిహ్‌ అలినెజద్‌ లాంటి ఉద్యమకారిణి సహా పలువురు సామాజిక వేత్తలు తబర్‌ విముక్తి కోసం పోరాడారు. దీంతో ఇరాన్‌ ప్రభుత్వం తగ్గి.. తబర్‌ను విడుదల చేసింది. 

హిజాబ్‌ విషయంలో ఆమె చేసిన ఒక చిన్న జోక్‌.. ఆమెను కటకటాల పాల్జేసింది. ఆమె కన్నతల్లి రోజూ కన్నీరు కార్చింది. ఈ వ్యవహారంలో నటి ఏంజెలీనా కలగజేసుకోవాలని మసిహ్‌ అలినెజద్‌ కోరారు కూడా. అయితే.. హిజాబ్‌ వ్యతిరేక నిరసనల నడుమ జైలు నుంచి ఆమెకు విముక్తి లభించింది. ఇక బెయిల్‌ మీద జైలు నుంచి బయటకు వచ్చాక.. తబర్‌ ఓ టీవీ ఛానెల్‌ ద్వారా తన అసలు రూపాన్ని ప్రపంచానికి చూపించింది. 

గతంలో ముఖానికి తాను కొన్ని సర్జరీలు చేయించుకున్న మాట నిజమేనని, అయితే.. వికృతంగా రూపం మాత్రం మారలేదని ఆమె వెల్లడించింది. సోషల్‌ మీడియాలో పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న ఫొటోల వెనుక.. ఫొటోషాప్‌ ఎడిటింగ్‌, కంప్యూటర్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నాయని ఆమె తెలిపింది. 

ఇదిలా ఉంటే.. 2017లో సర్జరీలు వికటించడంతో దెయ్యంలా మారిందంటూ తబర్‌ గురించి కొన్ని కథనాలు వెలువడ్డాయి.  ఆ తర్వాత ఆ ఫొటోలతోనే జాంబీ ఎంజెలీనా జోలిగా ఆమెకు సోషల్‌ మీడియాలో పేరు ముద్రపడిపోయింది. 

తబర్‌ అసలు పేరు ఫతేమెహ్‌ కిష్వంద్‌. సుమారు 50 సర్జరీలు చేయించుకున్నట్లు.. అవి వికటించడంతో దెయ్యంలా మారినట్లు అబద్ధం చెప్పింది. ఒక హీరోయిన్‌గా కంటే.. ఇలా సర్జరీలు వికటించిన బాధితురాలిగా పేరు ఎక్కువే దక్కించుకోవచ్చన్న ఆలోచన కొంతమేర వర్కవుట్‌ అయినా.. ఆపై బెడిసి కొట్టి జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement