
టాప్ అప్!
హాలీవుడ్ సుందరాంగి ఏంజలినా జోలీ తనకున్న పాపులారిటీ ఎంతో మరోసారి చాటిచెప్పింది. ఎమ్మా వాట్సన్ వంటి మెగా భామలందరినీ వెనక్కి నెట్టి ‘యూకే టాప్ ఫెమినిస్ట్ ఐకాన్’గా నిలిచింది. ‘రోజ్ అండ్ విల్లార్డ్’ ఫ్యాషన్ హౌస్ జాతీయ స్థాయిలో నిర్వహించిన పోల్‌లో ఈ ముప్పై తొమ్మిదేళ్ల నటి, యాక్టివిస్ట్‌కు పట్టం కట్టారు. యూఎన్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న నటి ఎమ్మా వాట్సన్ రెండో స్థానం దక్కించుకుంది.
ఇటీవలే జండర్ ఈక్వాలిటీ క్యాంపెయిన్ ‘హి ఫర్ షీ’ లాంచ్ చేసి సేవలందిస్తోంది ఎమ్మా. ప్రొఫెషనల్‌గానే కాకుండా సామాజిక సేవలో భాగంగా మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న జోలీ పర్‌ఫెక్ట్ ఫెమినిస్ట్ ఐకాన్ అని పోల్ నిర్వహించిన సంస్థ వ్యవస్థాపకులు హైదీ రెహమాన్ చెప్పారు. కెయిట్‌లిన్ మారన్, జెనిఫర్ లారెన్స్, జర్మైన్ గ్రీర్, టేలర్ స్విఫ్ట్ తరువాతి స్థానాల్లో ఉన్నారు.