పిల్లల్ని ఆమె దగ్గరే ఉంచండి: హీరో | Angelina Jolie, Brad Pitt reach custody agreement | Sakshi
Sakshi News home page

పిల్లల్ని ఆమె దగ్గరే ఉంచండి: హీరో

Nov 8 2016 11:51 AM | Updated on Sep 4 2017 7:33 PM

పిల్లల్ని ఆమె దగ్గరే ఉంచండి: హీరో

పిల్లల్ని ఆమె దగ్గరే ఉంచండి: హీరో

బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకున్న నేపథ్యంలో తమదగ్గరున్న తమ పిల్లల పెంపకంపై ఒక అంగీకారానికి వచ్చారు.

లాస్ ఏంజెలెస్: హాలీవుడ్ స్టార్స్ బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకున్న నేపథ్యంలో తమదగ్గరున్న తమ పిల్లల పెంపకంపై ఒక అంగీకారానికి వచ్చారు. ఆరుగురు పిల్లలను ఏంజెలినా జోలీ వద్ద ఉంచేందుకు బ్రాడ్ పిట్ అంగీకరించాడు. మాడెక్స్ జోలీ-పిట్(15), పాక్స్ జోలీ-పిట్(12), జహారా జోలీ-పిట్(11), షిలోహ్ జోలీ-పిట్(10), కవలలు కెనాక్స్ జోలీ-పిట్, వివీన్నె జోలీ-పిట్(8)... ఏంజెలినా జోలీ దగ్గర పెరగనున్నారు.

వీరిని అప్పుడప్పుడు బ్రాడ్ పిట్ కలిసేందుకు జోలీ అంగీకరించింది. అంతేకాదు తండ్రిని చూడాలని పిల్లలు కోరుకుంటే అభ్యంతరం చెప్పబోనని జోలీ హామీయిచ్చింది. పిల్లల సంరక్షణ నిపుణుల ఆధ్వర్యంలో కుదిరిన ఈ ఒప్పందంపై బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ వారం క్రితం సంతకాలు చేశారని జోలీ తరపు ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

బ్రాడ్, జోలీ 12 ఏళ్లపాటు కలిసుండి ఇటీవల విడిపోయారు. బ్రాడ్ పిట్ అంతకుముందు జెన్నిఫర్ అనిస్టన్ నుంచి విడిపోయాడు. ఏంజెలినా జోలీ మూడోసారి విడాకులు తీసుకుంది. అంతకుముందు ఆమె బిల్లీ బాబ్ థొర్నటన్, జానీ లీ మిల్లర్ తో వైవాహిక బంధాన్ని తెంచుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement