భార్య విడిపోవడంతో హీరో విషాదం | Brad Pitt is totally crushed after divorce from Angelina Jolie | Sakshi
Sakshi News home page

భార్య విడిపోవడంతో హీరో విషాదం

Oct 3 2016 5:07 PM | Updated on Sep 4 2017 4:02 PM

భార్య విడిపోవడంతో హీరో విషాదం

భార్య విడిపోవడంతో హీరో విషాదం

హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్ తన భార్య, హీరోయిన్ ఏంజెలినా జోలీ దూరమయ్యాక విషాదంలో మునిగిపోయాడు.

హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్ తన భార్య, హీరోయిన్ ఏంజెలినా జోలీ దూరమయ్యాక విషాదంలో మునిగిపోయాడు. ఏంజెలినా జోలీతో విబేధాలు ఏర్పడ్డాక ఇటీవల జరిగిన సంఘటనలు అతన్ని తీవ్రంగా బాధించినట్టు సన్నిహితులు చెబుతున్నారు. జోలీతో తన బంధం ముగుస్తుందని, విడాకులు తీసుకుంటామని బ్రాడ్ ఎప్పుడూ భావించలేదని చెప్పారు. పిల్లలకు దూరంగా ఉండటం కూడా బ్రాడ్ను బాధిస్తున్నట్టు తెలిపారు.

కుటుంబంలో ఏర్పడిన విబేధాలు, తన జీవితంలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల గురించి బ్రాడ్ తన తల్లిదండ్రులు, స్నేహితులతో చర్చించినట్టు సమాచారం. బ్రాడ్ తల్లి రోజు అతన్నిఓదారుస్తున్నట్టు సన్నిహితులు చెప్పారు. బ్రాడ్, జోలీ 12 ఏళ్ల  అనుబంధం ఇటీవల ముగిసింది. ఓ ప్రైవేట్ విమానంలో బ్రాడ్ మద్యంమత్తులో పిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించాడనే కోపంతో జోలీకి అతనికి దూరమైంది. బ్రాడ్ ఇంటి నుంచి వెళ్లిపోయిన జోలీ పిల్లలతో కలసి అద్దె ఇంట్లో ఉంటోంది. ఇటీవల విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేసింది. బ్రాడ్, జోలీ ఇద్దరూ తాత్కాలికంగా ఓ ఒప్పందం చేసుకున్నారు. జోలీ విడిపోయిన తర్వాత బ్రాడ్ ఇటీవల తొలిసారి తన పిల్లలను చూశాడు. ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన ఈ జోడీ రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. మరో ముగ్గురు పిల్లలను దత్తత తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement