
హాలీవుడ్‌కి బ్యూటీ క్వీన్ ఏంజెలీనా జోలీ. అందంలో ఆమె రాణీ అయితే అందమైన మనసుకు దేవత. అన్ని అందాలున్నా, సినిమాల్లోకి రావాలని ఏంజెలీనా ఎప్పుడూ అనుకోలేదు. కానీ విధి చక్రం తిప్పింది. క్యాన్సర్‌తో బాధపడుతున్న అమ్మ హాస్పిటల్ బిల్స్ ఎలా కట్టాలో తెలియని పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీలోకొచ్చింది. అంటే ప్రేమించిన వాళ్లకోసం సినిమాల్లోకొచ్చింది. సినిమాని ప్రేమించి కాదు. ఇప్పటికీ తను అలాగే ఉంది. ఎవరికి ఏ కష్టం వచ్చినా, సాయం చేయడానికి ముందుం టుంది.
ఏంజెలీనా తల్లిగారి పదవ వర్ధంతి దగ్గరలోనే ఉంది. ఆ విషయమై ఒక ప్రఖ్యాత టెలివిజన్ చానల్‌కి తనిచ్చిన ఇంటర్వ్యూలో తన హాలీవుడ్ ఎంట్రీ గురించి మొట్టమొదటిసారి చెప్పింది. తల్లి మార్షలీ ఒవేరియన్, బ్రెస్ట్ క్యాన్సర్‌తో చనిపోయారు. అమ్మకొచ్చిన క్యాన్సర్ తనకి కూడా వస్తుందని ఏంజెలీనా తన రొమ్ములు తీయించి, సిలికాన్ ఇంప్లాంట్స్ అమర్చుకుంది.