భర్తను వీడి అద్దెఇంటికి మారిన హీరోయిన్ | Angelina Jolie, Kids Move Into Rental Home After Divorce News | Sakshi
Sakshi News home page

భర్తను వీడి అద్దెఇంటికి మారిన హీరోయిన్

Published Mon, Sep 26 2016 12:14 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM

భర్తను వీడి అద్దెఇంటికి మారిన హీరోయిన్

భర్తను వీడి అద్దెఇంటికి మారిన హీరోయిన్

హాలీవుడ్ హీరోయిన్, దర్శకురాలు ఏంజెలినా జోలీ తన పిల్లలను తీసుకుని భర్త, హీరో బ్రాడ్ పిట్ ఇంటినుంచి వెళ్లిపోయింది. లాస్ ఏంజిలెస్లోని ఓ అద్దె ఇంట్లో జోలీ తన ఆరుగురు పిల్లలతో కలసి ఉంటున‍్నట్టు సమాచారం. 52 ఏళ్ల పిట్, 41 ఏళ్ల జోలీ విబేధాల కారణంగా దూరమయ్యారు. విడాకులు కోరుతూ గతనెలలో జోలీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

కుటుంబ శ్రేయస్సు దృష్ట్యా పిట్తో విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు జోలీ చెప్పింది. ఓ ప్రైవేట్ విమానంలో పిట్ పిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్టు వార్తలు వచ్చాయి. పిల్లల సంరక్షణ బాధ్యత తనకు అప్పగించాలని, పిట్కు పిల్లలను కలుసుకునే హక్కు మాత్రమే ఇవ్వాలని జోలీ కోర్టును కోరింది. జోలీ, పిట్ దంపతులకు ముగ్గురు సంతానం కాగా, మరో ముగ్గురు పిల్లలను దత్తత తీసుకున్నారు. పిట్ నటిస్తున్న ఓ ప్రాజెక్టు నుంచి ఇటీవల జోలీ వైదొలిగింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించేందుకు జోలీ తొలుత అంగీకరించినా, ఇటీవల జరిగిన పరిణామాల వల్ల పిట్తో వ్యక్తిగత, వృత్తిపరమైన సంబంధాలను పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement