కొన్ని వార్తలు విన్నప్పుడు ‘మనం విన్నది నిజమేనా?’ అని పిస్తుంది. ఇప్పుడు చెప్పబోతున్న వార్త అలాంటిదే అని ఈపాటికి గ్రహించే ఉంటారు.

కొన్ని వార్తలు విన్నప్పుడు ‘మనం విన్నది నిజమేనా?’ అని పిస్తుంది. ఇప్పుడు చెప్పబోతున్న వార్త అలాంటిదే అని ఈపాటికి గ్రహించే ఉంటారు. విషయంలోకొస్తే... హాలీవుడ్ అందాల తార ఏంజెలినా జోలీ ఎంతో ముచ్చటపడి తన ఆత్మకథ రాసుకున్నారు. జోలీ చరిత్ర అంటే బోల్డంత క్రేజ్ ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడానికి హాలీవుడ్‌కి చెందిన ముగ్గురు ప్రముఖ ప్రచురణకర్తలు పోటీపడుతున్నారట.
‘మీ ఆత్మకథ ప్రచురించే సువర్ణావకాశం మాకే ఇస్తే.. రెండు వందల కోట్ల రూపాయల వరకూ ఇస్తాం’ అని ఓ భారీ ఆఫర్‌ని జోలీ ముందుంచారట సదరు పబ్లిషర్స్. అందులో ఒక పబ్లిషర్ ఏకంగా రెండొందలముప్ఫయ్ కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చారని సమాచారం. జోలీ ఆత్మకథ హాట్ కేక్‌లా అమ్ముడుపోతుందనే ధీమాతోనే ఆ పబ్లిషర్ అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉండి ఉంటారని ఊహించవచ్చు. జోలీ మనసు ఈ ఆఫర్‌వైపే మొగ్గు చూపుతోందట. త్వరలోనే ఆ పబ్లిషర్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటున్నారట ఈ హాట్ గాళ్.