మా సమస్యలు మాకున్నాయ్! | ngelina Jolie Vogue Cover PHOTO: Mrs. Brad Pitt is Ready for Fall! | Sakshi
Sakshi News home page

మా సమస్యలు మాకున్నాయ్!

Oct 20 2015 12:45 AM | Updated on Sep 3 2017 11:12 AM

మా సమస్యలు మాకున్నాయ్!

మా సమస్యలు మాకున్నాయ్!

వైవాహిక బంధాన్ని కాపాడుకోవడం భార్యాభర్తల్లిద్దరి చేతుల్లో ఉంటుంది. ఒకరి లోపాలను మరొకరు ఇష్టపడాలి.

వైవాహిక బంధాన్ని కాపాడుకోవడం భార్యాభర్తల్లిద్దరి చేతుల్లో ఉంటుంది. ఒకరి లోపాలను మరొకరు ఇష్టపడాలి. లేదా నచ్చే పద్ధతిలో చెప్పి, మార్చుకోవాలి. ఇలాంటి విషయాలను ప్రస్తావిస్తూ హాలీవుడ్ నటి, దర్శకురాలు ఏంజెలినా జోలీ తీసిన చిత్రం ‘బై ది సీ’. ఈ చిత్రంలో ఏంజెలినా, ఆమె భర్త బ్రాడ్ పిట్ భార్యాభర్తలుగా నటించారు. వైవాహిక జీవితంలో ఏర్పడిన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఓ భార్య, భర్త ఏం చేశారనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది. రియల్ లైఫ్‌లో తనకూ, బ్రాడ్‌కూ మధ్య సమస్యలున్నాయంటూ -‘‘ఏ కాపురంలో అయినా అలకలు, కలతలు ఉంటాయి.

అవి విడిపోవడానికి కారణం కాకూడదు. అంత దూరం వెళ్లనివ్వకుండానే సమస్యలను పరిష్కరించుకోవాలి. మా మధ్య పొరపొచ్ఛాలు వచ్చినప్పుడు మేం కూర్చుని మాట్లాడుకుంటాం. ఏ విషయాన్నీ తెగేదాకా లాగం. మా సమస్యలను సినిమాలో పెట్టలేదు. సినిమాలో చూపించినవి వేరు’’ అని ఏంజెలినా చెప్పారు. బ్రాడ్ పిట్, ఏంజెలినా పదేళ్ల తర్వాత ఈ చిత్రం కోసం మళ్లీ జత కట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement