ఇక నటనకు గుడ్‌బై! | Angelina Jolie Decides to Quit Acting and Focus on Direction | Sakshi
Sakshi News home page

ఇక నటనకు గుడ్‌బై!

Published Mon, Apr 21 2014 10:50 PM | Last Updated on Sat, Sep 2 2017 6:20 AM

ఇక నటనకు గుడ్‌బై!

ఇక నటనకు గుడ్‌బై!

హాలీవుడ్ హాట్ లేడీ ఏంజెలినా జోలీ అభిమానులకు ఓ చేదు వార్త. ఇక, ఆమె నటనకు గుడ్‌బై చెప్పేయాలనుకుంటున్నారు. నిజానికి రెండేళ్ల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నారామె.

హాలీవుడ్ హాట్ లేడీ ఏంజెలినా జోలీ అభిమానులకు ఓ చేదు వార్త. ఇక, ఆమె నటనకు గుడ్‌బై చెప్పేయాలనుకుంటున్నారు. నిజానికి రెండేళ్ల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నారామె. ఆరుగురు బిడ్డలకు తల్లయిన జోలీ, నలుగురు పిల్లల్నిదత్తత కూడా తీసుకున్నారు. ఈ పిల్లల ఆలనా పాలనా చూసుకోవాలనుకుంటున్నానని, అందుకే ఇక నటించకూడదనుకుంటున్నానని రెండేళ్ల క్రితం ఆమె పేర్కొన్నారు. ఆ మేరకు ఓ రెండేళ్లు సినిమాలకు దూరంగానే ఉన్నారు. ఆ తర్వాత మనసు మార్చుకుని ‘మేల్‌ఫిషెంట్’ అనే సినిమాలో నటించారు. వచ్చే నెల ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా చేస్తూ, పిల్లలను చూసుకోవడం పెద్ద కష్టమనిపించలేదట.
 
 అయినప్పటికీ నటనకు గుడ్‌బై చెప్పాలనుకోవడం ఎందుకంటే, ఇకనుంచి దర్శకురాలిగా మాత్రమే కొనసాగాలనుకుంటున్నారట. ప్రస్తుతం ఆమె ‘అన్‌బ్రోకెన్’ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. అన్నట్లు దర్శకురాలిగా జోలీకి ఇది మొదటి సినిమా కాదు. 2007లో ‘ఎ ప్లేస్ ఇన్ టైమ్’ అనే లఘు చిత్రం ద్వారా దర్శకురాలిగా మారి, ఆ తర్వాత నాలుగేళ్లకు ‘ఇన్ ది ల్యాండ్ ఆఫ్ బ్లడ్ అండ్ హనీ’ అనే సినిమాకి దర్శకత్వం వహించారు. ఇప్పుడు ‘అన్‌బ్రోకెన్’ చేశారు. ఈ సినిమా తర్వాత వరుసగా దర్శకత్వం వహించాలనుకుంటున్నారట. నటన అనేది ఓ వరం అని, ఆ వరాన్ని సద్వినియోగం చేసుకున్నానని, దర్శకురాలిగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా జోలీ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement