![Nayanthara Latest Social Media post Goes Viral - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/26/nayanthara.jpg.webp?itok=aIFJxdgv)
తమిళసినిమా: అగ్ర కథానాయిక నయనతార కొత్త అవతారం ఎత్తనుందా అంటే ఆమె అభిమానులు అవుననే అంటున్నారు. ఎక్కడో కేరళ రాష్ట్రంలోని మారుమూల గ్రామంలో పుట్టిన డయానా కురియన్ అనే మలయాళ కుట్టి నయనతార నటిగా సినీ విశ్వరూపం దాల్చుతుందని ఆమె కూడా ఊహించి ఉండరు. నటిగా రంగప్రవేశం చేసి అగ్ర కథానాయకి స్థాయికి చేరుకుని ఆ తరువాత రౌడీ పిక్చర్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి నిర్మాతగా అవతారం ఎత్తారు. అంతటితో ఆగకుండా వ్యాపార రంగంలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్‌గా రాణిస్తున్నారు.
మరో పక్క వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తూ నాలుగు చేతులా ఆర్జిస్తున్నారు. ప్రస్తుతం తన కవల పిల్లలతో ముద్దు, మురిపాలు కురిపిస్తూనే మరో పక్క హీరోయిన్‌గా టాప్ లెవెల్‌లో సాగిపోతున్నారు. తాజాగా ఈమె కథానాయకి పాత్రకు ప్రాధాన్యత కలిగిన పాత్రలో నటించిన అన్నపూరణి చిత్రం డిసెంబర్ ఒకటో తేదీ తెరపైకి రానుంది. అదే విధంగా నయనతార నటిస్తున్న మరో చిత్రం మన్నాంగట్టి. ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది.
ఈ సందర్భంగా ఈమె కెమెరా వెనుక నిలబడి చూస్తున్న ఫొటోను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. అందులో ఇది న్యూ అవతారం నమ్మండి అని పేర్కొన్నారు. దీంతో మెగా ఫోన్ పట్టడానికి రెడీ అవుతున్నారని ఆమె అభిమానులు సంబరపడుతున్నారు. అయితే ఇది పబ్లిసిటీ స్టంటా, లేక నయనతార భవిష్యత్తులో దర్శకత్వం వహించడానికి సిద్ధం అవుతున్నారా? అనే చర్చ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment