నటిగా రోహిణి 1974లోనే బాలనటిగా తెరంగేట్రం చేశారు. తర్వాత కథానాయకిగా పలు చిత్రాల్లో నటించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. అంతే కాదు ఈమెలో మంచి డబ్బింగ్ కళాకారిణి, దర్శకురాలు కూడా ఉన్నారు. 2005లోనే చిన్న చిన్న ఆశై అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.ఆ తరువాత ఒక డాక్యుమెంటరీ చిత్రం కూడా చేశారు.
(ఇది చదవండి: కన్నీరు పెట్టుకున్న శోభ, యావర్.. నేడు షో టైమింగ్స్‌లో మార్పు)
తాజాగా మరోసారి మెగా ఫోన్ పట్టడానికి సిద్ధమైనట్లు సమాచారం. యదార్థ ఘటనలతో ఇప్పటికే చాలా చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో పలు చిత్రాలు విజయాన్ని సాధించాయి. జైభీమ్, సూరారై పోట్రు వంటి చిత్రాలు ఈ కోవలోకి వస్తాయి. కాగా ఆ మధ్య తమిళనాడునే ఉలిక్కిపడేలా చేసిన వాచ్ఛాత్తి హింసా సంఘటన ఇప్పుడు వెండితెరకెక్కనుంది. దీనికి నటి రోహిణి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. కాగా దీనికి రచయిత ఆదవన్ దీక్షగా మాటలు,కథనం రాస్తున్నారు. ఇందులో జై భీమ్ చిత్రం ఫేమ్ లిజోమోల్ జోస్ ప్రధాన పాత్రను పోషించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment