తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న నటి శృతిహాసన్. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా నటిస్తూ అగ్రనాయికల్లో ఒకరుగా పేరు సంపాదించుకున్నారు. ఇటీవల సంక్రాంతికి విడుదలైన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల్లో నటించింది తమిళ భామ. బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది. కాగా.. ఈ కోలీవుడ్ భామ శాంతను హజారికాతో రిలేషన్‌షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే.
తాజాగా శ్రుతి హాసన్, తన ప్రియుడు శాంతను హజారికాతో ఫోటోను తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. తన ప్రేమను వెల్లడిస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ కూడా చేసింది. తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో రాస్తూ..' ఈ ప్రపంచంలో నీకంటే సంతోషంగా నన్ను ఎవరూ చూసుకోలేరు' అంటూ ఫన్నీ ఎమోజీలు జతచేసింది. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే ఇటీవల వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు శృతి హాసన్ హాజరు కాకపోవడంతో ట్రోల్స్‌కు గురైంది. దీంతో తాను అనారోగ్య కారణాలతోనే హాజరు కాలేదని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కాగా.. ఆమె ప్రశాంత్ నీల్ రాబోయే యాక్షన్ చిత్రం సలార్‌లో ప్రభాస్‌కు జోడీగా కనిపించనుంది. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, మధు గురుస్వామి, ఈశ్వరీరావు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment