హాలీవుడ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ కపుల్స్ ఎంజెలీనా జోలీ(41), ఆస్కార్ ఆవార్డు విజేత బ్రాడ్ ఫిట్(52) విడిపోతున్నారు. పన్నేండేళ్ల బంధానికి, రెండున్నారేళ్ల వైవాహిక జీవితానికి గుడ్బై చెప్పేస్తున్నారు. ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి మధ్యలో మరో అమ్మాయి రావడమే అందుకు ప్రధాన కారణమైంది. ఎంజెలీనా, బ్రాడ్ ఫిట్లకు 2014లో వివాహం అయింది. అంతకుముందు పన్నెండేళ్లపాటు లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. 2004 నుంచి వీరిద్దరు ఒకే ఇంట్లో ఉండటమే కాకుండా మంచి కపుల్స్ అని పేరు కూడా తెచ్చుకున్నారు.