అనుకోకుండా.. | Angelina Jolie Has “Girl Crush” On Loung Ung? | Sakshi
Sakshi News home page

అనుకోకుండా..

Published Mon, Dec 11 2017 12:16 AM | Last Updated on Mon, Dec 11 2017 12:16 AM

Angelina Jolie Has “Girl Crush” On Loung Ung? - Sakshi

యాక్టింగ్‌ కెరీర్‌లో ఏంజెలినా జోలీ ఎంత సక్సెస్‌ అయ్యారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అంతేకాదు ఆస్కార్‌ అవార్డులను కూడా ఆమె గెల్చుకున్నారు. యాక్టింగ్‌లో ఇంత పాపులారిటీ సంపాదించుకున్న ఏంజెలినా యాక్టింగ్‌ ఫీల్డ్‌లోకి ఇష్టంతో రాలేదట. వచ్చిన తర్వాత నటనపై ఎక్కువ మక్కువ పెంచుకున్నారట. ఈ విషయాన్ని ఏంజెలీనానే వెల్లడించారు. ‘అనుకోకుండా యాక్టర్‌ అయ్యా. అమ్మ ఆర్థిక ఇబ్బందులను తగ్గించేందుకు వీలైనంత ఎక్కువగా కష్టపడాలని నిర్ణయించుకున్నా.

కెరీర్‌ను స్టార్ట్‌ చేసిన కొత్తలో ఏదో జాబ్‌ చేస్తున్న ఫీలింగ్‌ మాత్రమే ఉండేది నాకు. కానీ యాక్టింగ్‌ ఫీల్డ్‌ డిఫరెంట్‌ అని తెలుసు. లైఫ్‌లో కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. డిఫరెంట్‌ ప్లేసేస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి అనుభవాల వల్ల కొత్త విషయాలను నేర్చుకొవచ్చు. లక్కీగా ఈ విషయాలన్నింటినీ నేను తొందరగానే తెలుసుకోగలిగాను. ఆ తర్వాత ఇదో అద్భుతమైన క్రియేటివ్‌ ఫీల్డ్‌ అని అర్థమైంది. మెల్లిగా స్కిల్స్‌ను డెవలప్‌ చేసుకున్నా. అంతేకాదు మానసికంగానూ పరిణితి చెందా  ఇప్పుడు నటిగా నాకు ఎంతగానో ఆదరణ లభిస్తోంది. చాలా సంతోషంగా ఉంది’ అన్నారు ఏంజెలీనా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement