ప్రేమా? రుగ్మతా? | Angelina Jolie to adopt 7th child? | Sakshi
Sakshi News home page

ప్రేమా? రుగ్మతా?

Published Sun, Aug 5 2018 1:24 AM | Last Updated on Fri, Jul 26 2019 5:58 PM

Angelina Jolie to adopt 7th child? - Sakshi

హాలీవుడ్‌ నటి ఏంజెలినా జోలీకి ఆరుగురు పిల్లలున్నారు. అందులో ముగ్గురు దత్త పుత్రులు కాగా మరో ముగ్గురు బ్రాడ్‌ పిట్, ఏంజెలినా దంపతులకు జన్మించినవారు. ఇప్పుడు మరో బాబు లేదా పాపను దత్తత తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట ఏంజెలినా. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏంజెలినాకు పిల్లలంటే ఎంత ఇష్టమో. బ్రాడ్‌పిట్‌తో విడాకుల తర్వాత పిల్లల సంరక్షణ, తండ్రితో ఎక్కువ సమయం గడపనివ్వడం లేదని కేస్‌ విషయమై ప్రస్తుతం ఈ మాజీ భార్యా భర్తలు కోర్ట్‌ చుట్టూ తిరుగుతున్నారు. ఏంజెలినా నటించిన తాజా చిత్రం ‘మాలిఫిసెంట్‌ 2’. ఈ సినిమా ప్రమోషన్స్‌ తర్వాత దత్తత తీసుకోవాలనుకుంటున్నారట.

ఏంజెలినాకు పిల్లలంటే భలే ఇష్టమని కొందరు, ‘ఎమ్‌టీనెస్ట్‌ సిండ్రోమ్‌’తో (జీవితంలో ఏదో వెలితి ఉందనే రుగ్మత) బాధపడటం వల్లే ఇలా చేస్తున్నారని మరికొందరు భావిస్తున్నారు. పిల్లలు పెద్ద వాళ్లు అవ్వడంతో తన అవసరం ఇంక ఉండకపోవచ్చని భావించడం ఆ సిండ్రోమ్‌ లక్షణాలట. మరి ఏంజెలినాది ప్రేమా? సిండ్రోమా? ఏదైతేనేం.. ఆమె దత్తత తీసుకునే బిడ్డ లక్కీ అని చెప్పాలి. మంచి జీవితం దొరుకుతుంది కదా. అన్నట్లు.. ఏంజెలినా తన కడుపున పుట్టిన బిడ్డలకు సమానంగా దత్తత తీసుకున్నవారిని కూడా చూస్తారట. కంటేనే అమ్మ అని అంటే.. ఎలా? కడుపు తీపి తెలిసిన ప్రతి తల్లీ తల్లే అనాలి. ఏంజెలినా.. ఓ మంచి మదర్‌ అని హాలీవుడ్‌ వారు అంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement