ఏంజెలినా జోలీ దర్శకత్వంలో ఆఫ్రికా! | Angelina Jolie to direct Richard Leakey biopic 'Africa | Sakshi
Sakshi News home page

ఏంజెలినా జోలీ దర్శకత్వంలో ఆఫ్రికా!

Published Mon, Sep 22 2014 11:41 PM | Last Updated on Sat, Sep 2 2017 1:48 PM

ఏంజెలినా జోలీ  దర్శకత్వంలో ఆఫ్రికా!

ఏంజెలినా జోలీ దర్శకత్వంలో ఆఫ్రికా!

 ‘‘నాకు ఆఫ్రికాతో మంచి అనుబంధం ఉంది. అక్కడి సంస్కృతి, సంప్రదాయాలంటే నాకు చాలా మక్కువ’’ అని ఏంజెలినా జోలీ అంటున్నారు. ఈ హాలీవుడ్ హాట్ లేడీ ప్రత్యేకంగా ఆఫ్రికా గురించి చెప్పడానికి కారణం ఉంది. ఆ దేశపు అడవుల్లో జరిగిన ఏనుగు దంతాల అక్రమ రవాణా నేపథ్యంలో ఓ చిత్రం రూపొందనుంది. ‘ఆఫ్రికా’ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి ఏంజెలినా దర్శకత్వం వహించనున్నారు. కథానాయికగా మంచి పేరున్న జోలీ దర్శకురాలిగా రెండు, మూడు చిత్రాలు చేశారు. తాజాగా     ఈ చిత్రం చేయడానికి అంగీకరించారు.
 
 ఆఫ్రికన్ ఏనుగు దంతాలను అక్రమంగా రవాణా చేసేవారి గురించి విస్తృతంగా ప్రచారం చేసిన పేలియో ఆంథ్రోపాలజిస్ట్ (అంతరించిన మానవ జాతుల సమూహ జీవనాల గురించి అధ్యయనం చేసే నిపుణులు) రిచర్డ్ లీ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందించనున్నారు. కెన్యాలో జంతు సంరక్షణ సేవా సంస్థకు రిచర్డ్ ఒకప్పుడు అధినేతగా కూడా ఉన్నారు. ఏనుగు దంతాల అక్రమ రవాణాను అరికట్టడానికి ఎంతో కృషి చేశారాయన. మూగజీవాల కోసం పని చేసిన మనసున్న వ్యక్తి జీవితం ఆధారంగా రూపొందే ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం రావడంపట్ల జోలీ ఆనందం వెలిబుచ్చారు. ‘ఫారెస్ట్ గంప్’ అనే చిత్రానికి ఉత్తమ రచయితగా ఆస్కార్ అవార్డు అందుకున్న ఎరిక్ రోథ్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement