యుద్ధ కళల నేపథ్యంలో... | Sonakshi’s Role In Murugadoss’ Next Won’t Be Like Angelina Jolie In Lara Croft | Sakshi
Sakshi News home page

యుద్ధ కళల నేపథ్యంలో...

Published Tue, Jun 10 2014 10:41 PM | Last Updated on Sat, Sep 2 2017 8:35 AM

యుద్ధ కళల నేపథ్యంలో...

యుద్ధ కళల నేపథ్యంలో...

 ఏ విద్య అయినా సరే వృధా కాదు. ఎప్పుడో ఒక సమయంలో ఎలాగోలా అది అక్కరకు వస్తుంది. అది నటి సోనాక్షి సిన్హా విషయంలో త్వరలో నిజం కాబోతోంది. ఆ మధ్య ‘హాలీడే’ సినిమా కోసం సోనాక్షి బాక్సింగ్ నేర్చుకున్న విషయం తెలిసిందే. ఈ విద్య ‘హాలీడే’ చిత్రానికి ఎంత వరకూ ఉపయోగపడిందో తెలీదు కానీ... త్వరలో ఆమె నటించబోయే ఓ సినిమాకు మాత్రం అది కావల్సినంత భరోసా ఇవ్వబోతోంది. వివరాల్లోకెళ్తే... అక్షయ్‌కుమార్, సోనాక్షి జంటగా దర్శకుడు మురుగదాస్ ‘హాలీడే’ సినిమా రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడే సోనాక్షీతో మరో సినిమా చేయాలని మురుగదాస్ నిర్ణయించుకున్నారు.
 
 అది స్త్రీ ప్రధాన చిత్రం కావడం గమనార్హం. కథ చెప్పగానే... సోనాక్షి ‘ఓకే’ చెప్పేశారట. షూటింగ్‌కి ముందే ఈ సినిమాకోసం ముప్పై రోజులపాటు జరిగే వర్క్‌షాప్‌కు కూడా హాజరయ్యేందకు సోనాక్షి అంగీకరించినట్లు సమాచారం. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో సోనాక్షి కళాశాల విద్యార్థినిగా నటిస్తారని తెలుస్తోంది. కేరళ నేపథ్యంలో భారతీయ యుద్ధ కళల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సోనాక్షీతో తెరకెక్కించినబోయే ఈ సినిమా తన మనసుకు ఎంతో దగ్గరైందని, ఈ సినిమా ద్వారా మన దేశ మహిళలకు ఓ శక్తిమంతమైన సందేశాన్ని వ్యక్తిగతంగా ఇవ్వాలనుకుంటున్నానని మురుగదాస్ తెలిపారు. ఏంజెలినా జోలీ నటించిన ‘లారా క్రాఫ్ట్’ చిత్రానికి దగ్గరగా ఈ సినిమా ఉంటుందని మురుగదాస్ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement