ఆమె ముంబై లేడీ రజనీ అట.. | Sonakshi is Lady Rajini of Mumbai: A.R. Murugadoss | Sakshi
Sakshi News home page

ఆమె ముంబై లేడీ రజనీ అట..

Published Thu, May 21 2015 1:25 PM | Last Updated on Sun, Sep 3 2017 2:27 AM

ఆమె  ముంబై లేడీ రజనీ అట..

ఆమె ముంబై లేడీ రజనీ అట..

ముంబై:   'అకీరా'  హిందీ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న దర్శకుడు ఎఆర్ మురుగదాస్..బాలీవుడ్ హీరోయిన్ సానాక్షి సిన్హా   నటనకు ఫిదా అయిపోతున్నాడట. ఇటీవలి కాలంలో  సోషల్ మీడియాలో డబ్స్మాష్  వీడియోలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ  నేపథ్యంలో సోనాక్షి షేర్ చేసిన ఓ వీడియోను చూసి మురుగదాస్...ఆమెను పొగడ్తలతో ముంచెత్తాడు.   

గజనీ, హాలీడే, కత్తి సినిమాల విజయంతో జోరు మీదున్న ఈ దర్శకుడు...   సోనాక్షిని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్తో పోలుస్తూ 'లేడీ రజనీ ఆఫ్ ముంబై' అని ట్వీట్ చేశాడు. ఆమె డైలాగ్ డెలివరీకి ముగ్దుడైన  మురుగదాస్ ఈ ప్రశంసలు ఇచ్చాడు

కాగా  తమిళంలో సూపర్ హిట్టయిన  'మౌన గురు' సినిమాను అకీరా  పేరుతో మురుగదాస్   హిందీలో రీమేక్ చేస్తున్నాడు. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో  తండ్రీ కూతుళ్లయిన శతృఘ్న సిన్హా, సోనాక్షి కలిసి నటిస్తుండటం విశేషం.  ఈ సందర్భంగా తేవర్ సినిమాలో  సోనాక్షి  నటించిన  ఒక వీడియోను మురుగదాస్  సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement