
ఏంజెలినాకు సరిలేరు మరెవ్వరూ..
వయసు పెరుగుతున్నా.. ఏంజెలినా జోలీకి హాలీవుడ్‌లో డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు.
లాస్ ఏంజెలిస్: వయసు పెరుగుతున్నా.. ఏంజెలినా జోలీకి హాలీవుడ్‌లో డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ అత్యధిక పారితోషికం అందుకుంటున్న హాలీవుడ్ కథానాయిక జోలీనే. 2013లో తాను 3.3 కోట్ల డాలర్లు (200 కోట్ల రూపాయలు) ఆదాయాన్ని ఆర్జించినట్లు ఆమె వెల్లడించింది. ఉమెన్స్ మీడియా సెంటర్ నివేదిక ప్రకారం చూసినా ఎక్కువ ఆదాయాన్ని గడిస్తున్న మహిళా నటిగా ఏంజెలినా జోలీ ప్రథమ స్థానంలో ఉంది. జెన్నిఫర్ లారెన్స్ 2.6 కోట్ల డాలర్ల ఆదాయంతో రెండో స్థానంలో ఉంది. క్రీస్టెన్ స్టివార్ట్(2.1 కోట్ల డాలర్లు), జెన్నిఫర్ అనిస్టాన్ (2 కోట్ల డాలర్లు), ఎమ్మాస్టోన్(1.6 కోట్ల డాలర్లు) జాబితాలో ఒకరి తర్వాత ఒకరు ఉన్నారు. ఇక కథానాయకుల విషయానికొస్తే.. రాబర్ట్ డౌనే జూనియర్ జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్నాడు. ఇతడి వార్షిక ఆదాయం 7.5 కోట్ల డాలర్లు.