ఓ చిన్నారి పుట్టుకతో ముక్కు లేకుండా జన్మించాడు. ఆ చిన్నారి తల్లికి 20 వారాల గర్భంగా ఉన్నప్పుడే పుట్టబోయే బిడ్డలో ఏదో సమస్య ఉందని తెలిసింది. ఆ తర్వాత స్కానింగ్‌లో బిడ్డ ముక్కు కనిపించ లేదని, అలాగే బిడ్డ కూడా పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా లేడని చెప్పారు వైద్యులు. అయితే ఆ తల్లి అబార్షన్ చేయించుకునేందకు ఇష్టపడలేదు. ఎలా ఉన్నా.. భూమ్మీదకు తీసుకురావాలని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యింది. చివరికీ వైద్యులు చెప్పినట్లుగానే జన్మించాడు. ఆ బిడ్డ బతికే క్షణాలు కూడా తక్కవే అని పెదవి విరిచారు డాక్టర్లు. సీన్ కట్ చేస్తే..22 ఏళ్ల తర్వాత..
అసలేం జరిగిందంటే..యూఎస్‌కి చెందిన జాన్, మేరీ జో దంపతులు తమ తొలి సంతానం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మేరీ జో సరిగ్గా 20 వారాల గర్భతగా ఉండగా.. ఏదో సమస్య తలెత్తుందని అనిపించింది. వారి ఊహించినదే నిజమైంది. స్కానింగ్‌లో పుట్టబోయే బిడ్డ మెదడు సరిగా అభివృద్ధి చెందలేదని, అలాగే ముక్కు కూడా లేదని తేలింది. శిశువు పుట్టిన బతకడం కష్టం అని గర్భస్రావం చేయించుకోవాల్సిందిగా మేరీ జోకి సూచించారు. అయితే అందుకు ఆ దంపతుల మనసు అంగీకరించ లేదు. దీంతో వారు ఏం జరిగినా ఆ బిడ్డను ఈ భూమ్మీదకు తెచ్చి పెంచుకుందామని గట్టిగా డిసైడ్ అయిపోయారు. అయితే ఆ బిడ్డ వైద్యులు చెప్పినట్లుగానే జన్మించడం జరిగింది. అదీకూడా డెలీవెరీకి ఐదువారాల ముందుగానే సీజేరియన్ చేసి పండంటి మగ బిడ్డను బయటకు తీశారు వైద్యులు. ఇక ఆ శిశువుకి పుట్టడంతోనే ముక్కు, కనురెప్పలు ఏర్పడలేదు.
పైగా శిశువు మెదడులో ఎడమవైపు భాగం కూడా అభివృద్ధి చెందలేదు. అలాగే ఆ శిశువు పాదాలకు వేళ్లు కూడా లేవు. దీంతో డాక్టర్లు ఎంతసేపో ఆ శిశువు బతకదని పెదవి విరిచారు. ఎందుకంటే? ముక్కు లేదు కాబట్టి అస్సలు శ్వాస పీల్చుకోగలుగుతుందా లేదనది ఒక ప్రశ్న అయితే ఆక్సిజన్ మెదడకు సక్రమంగా అందకపోతే బతికే ఛాన్స్ అనేది కచ్చితంగా ఉండదు. ఈ రసవత్తరకరమైన ఆందోళనల మధ్య ఓ అద్భుతంలా ఆ శిశువు శ్వాస పీల్చుకోవడం బతకడం చకచక జరిగిపోయింది. వైద్యులు కూడా ఊహించని రీతీలో ఆ శిశువు కోలుకుంటూ..జస్ట్ డెలివరీ అయిన ఒక్క వారంలోనే డిశ్చార్చ్ అయ్యి తల్లిదండ్రలతో వెళ్లిపోయాడు.
అయితే తల్లిదండ్రలు ఆ బిడ్డని కంటికి రెప్పలా కాచుకుంటూ అత్యంత భద్రంగా పెంచారు. ఎందుకంటే ముక్కులేదు కాబట్టి రంధ్రంగా ఉన్న ఆ ప్లేస్‌లో ఒక సన్నని నెట్‌మాదిరి క్లాత్‌ని అడ్డంగా ఉంచేవారు. అలాగే కళ్లకు రెప్పలు లేవు కాబట్టి నిద్ర వచ్చే సమయంలో వైద్యులు ఇచ్చిన ఒక రకమైన ద్రవాన్ని రక్షణగా ఉంచేవారు. అలా ఆ బిడ్డకు ఆరు నెలల వయసు వచ్చే వరకు ఓ గాజు ముక్కలా కాపడుకుంటూ వచ్చారు. ఆ తర్వాత పెరిగి పెద్దయ్యే వరకు చాలా సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. దాదాపు 30 సర్జరీలు దాక చేయించుకున్నాడు. ప్రస్తుతం ఆ చిన్నారి వయసు 22 ఏళ్లు. ఇప్పుడు అతను అందరిలానే సంగీతం, బేస్‌బాల్ వంటి ఆటలు ఆడుతూ హాయిగా గడుపుతున్నాడు. ఆ చిన్నారికి పేరు గ్రే కెనాల్స్.
పుట్టుకతో ముక్కు లేకపోవడంతో కేవలం దీని పునర్నిర్మాణం కోసం ఏకంగా 11 సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. ఇలా అత్యంత అరుదుగా కొద్దిమందికి మాత్రమే జరగుతుందని వైద్యులు చెబుతున్నారు. పైగా పూర్తి ముక్కుని పునర్నిర్మించడం అనేది అత్యంత క్లిష్టమైన సర్జరీ కూడా. అలాగే అతడి తల్లిందండ్రులు కూడా అతడు ఎదిగే క్రమంలో తన తోటి పిల్లలతో చులకనకు గురవ్వకూడదని ఇంట్లోనే ఉంచి చదువు చెప్పించారు. అలాగే తన పట్ల ఎవ్వరూ జాలి చూపకుండా ఎలా మసులుకోవాలో కూడా కెన్నాల్‌కి తల్లిదండ్రులు నేర్పించారు.
అంతేగాదు ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను చూసి బాధపకడ పోగా ప్రత్యేక అవసరాలున్న పిల్లలను ప్రత్యేకమైన తల్లిదండ్రులకే ఇస్తాడని సగర్వంగా చెప్పారు. పైగా వైకల్యంతో పుట్టిన పిల్లల పట్ల ఎలా తల్లిదండ్రులు వ్యవహరించాలనేందుకు స్ఫూర్తిగా నిలిచారు ఆ దంపతులు. బిడ్డ సమస్యను ముందు తల్లిదండ్రులే ధైర్యంగా ఫేస్ చేసేందుకు రెడీ అయితేనే బిడ్డలో స్థైర్యాన్ని నిపంగలమని చాటి చెప్పారు. ఇక కెన్నాల్ కూడా తాను ఇన్ని సర్జరీలు చేసి నరకయాతన చూసిన తల్లిదండ్రులు ఇచ్చిన స్థైర్యాన్ని ఆశని వదులకోకపోవడం విశేషం. ఇక కెనాల్స్ కూడా ఈ సర్జరీల వల్ల తన జీవితానికి కలుగుతున్న అంతరాయన్ని అధిగమించి చక్కగా ముందుకు సాగిపోయేలా ప్లాన్ చేసుకుంటానని ఆత్మవిశ్వాసంగా చెబుతున్నాడు. మరీ అతనికి ఆల్ ద బెస్ట్ చెబుదామా!.
(చదవండి: నెయిల్ పాలిష్ రిమూవర్ ఇంత డేంజరా? మంటల్లో చిక్కుకున్న చిన్నారి..)
Comments
Please login to add a commentAdd a comment