అణ్వస్త్ర సామర్థ్యమున్న అమెరికా యుద్ధవిమాన వాహక నౌకలో పాప పుట్టింది.
వాషింగ్టన్: అణ్వస్త్ర సామర్థ్యమున్న అమెరికా యుద్ధవిమాన వాహక నౌకలో పాప పుట్టింది. అమెరికా నేవీకి చెందిన డ్వైట్ డీ ఐసెంట్ హోవర్ నౌకలో విధులు నిర్వర్తిస్తున్న నావికురాలికి అకస్మాత్తుగా నొప్పులు రావడంతో నౌకలోని వైద్యవిభాగానికి తరలించగా, అక్కడ అమ్మాయికి జన్మనిచ్చింది.
ఐసిస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పర్షియన్ తీరంలో సైనిక కార్యకలాపాల్లో ఉండగా ఈ ఘటన జరిగింది. 20 వారాల లోపు గర్భిణులనే నౌకలపై విధులకు అనుమతిస్తారు. అయితే ఈమె తన గర్భం గురించి అధికారులకు చెప్పలేదు. తల్లీబిడ్డలను హెలికాప్టర్‌లో బహ్రెయిన్‌కు పంపించి వైద్యసేవలు అందిస్తున్నారు.