వారి హృదయాలు.. పదిలం..! | uk doctors team free surgeries | Sakshi

వారి హృదయాలు.. పదిలం..!

Dec 17 2016 10:49 PM | Updated on Sep 4 2017 10:58 PM

వారి హృదయాలు.. పదిలం..!

వారి హృదయాలు.. పదిలం..!

వారంతా ఇంగ్లాండ్‌ దేశానికి చెందిన వారు. ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో చికిత్స పొందుతున్న రోగులకు సేవలందించడంలో అత్యంత నిష్ణాతులు. ఇంగ్లాండులోని హీలింగ్‌ లిటిల్‌ హార్ట్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నగరంలోని ఆంధ్రా హాస్పటల్‌లో గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ఐదు రోజుల పాటు గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించారు.

విజయవాడ (లబ్బీపేట) : వారంతా ఇంగ్లాండ్‌ దేశానికి చెందిన వారు. ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో చికిత్స పొందుతున్న రోగులకు సేవలందించడంలో అత్యంత నిష్ణాతులు. ఇంగ్లాండులోని హీలింగ్‌ లిటిల్‌ హార్ట్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నగరంలోని ఆంధ్రా హాస్పటల్‌లో గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ఐదు రోజుల పాటు గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఈ చికిత్సలు చేసేందుకు పిడియాట్రిక్‌ కార్డియాలజీ విభాగానికి చెందిన నిష్ణాతులైన వైద్యులతో పాటు, ఇంటెన్సివ్‌ కేర్‌ నర్సింగ్‌ సిబ్బంది విచ్చేశారు.ఆరు నెలల  వయస్సు నుంచి పదేళ్ల వయస్సున్న  26 మంది చిన్నారులకు  ఐదురోజుల పాటు గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించారు.
ఆత్మీయ సేవలు
 శస్త్ర చికిత్స అనంతరం కార్డియాక్‌ ఐసీయూలో వున్న చిన్నారులకు ఇంగ్లాండ్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ బృందం విశేష సేవలందించారు. ఆప్యాయంగా చిన్నారులను పలుకరిస్తూ  వారిలో ఉల్లాసాన్ని నింపేందుకు తమవంతు ప్రయత్నం చేశారు. వారికి రక్తం ఎక్కించడం, మందులు వేయడం వంటి అన్ని పనులను వారే చూసుకున్నారు.  ఇంటెన్సివ్‌ కేర్‌లో సర్జరీ అయిన తర్వాత చిన్నారులకు అందించే సేవలపై ఇక్కడి నర్శింగ్‌ సిబ్బందికీ అవగాహన కల్పించారు. కాగా దేశం కానీ దేశం వచ్చి ఇక్కడ సేవలు అందించిన ఇంగ్లాండ్‌ బృందం సేవలపై చిన్నారుల తల్లిదండ్రులతో పాటు, ఇక్కడి వైద్యం బృందం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక్కడ సేవలు అందించడం  అదృష్టంగా భావిస్తున్నామని వారు తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వచ్చేందుకు వారు సంసిద్ధత వ్యక్తంచేశారు.
యూకే నుంచి వచ్చిన బృంద సభ్యులు వీరే
యూకే నుంచి వచ్చిన బృంద సభ్యులలో పిడియాట్రిక్‌ ఇంటర్నేషనల్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ విక్రమ్‌ కుడుములు, పిడియాట్రిక్‌ కార్డియో థోరాసిక్‌ సర్జన్లు డాక్టర్‌ రమణ దన్నపనేని, డాక్టర్‌ ఆనంద్‌వా, డాక్టర్‌ అపర్ణహాస్‌కోట్, డాక్టర్‌ బలరామ్‌బాబు, డాక్టర్‌  ఫిల్‌ ఆర్నాల్డ్,  డాక్టర్‌ సుబ్రహ్మణ్యం చెల్లప్పన్, సిబ్బంది లూయిగి సెరిల్లో, జాన్‌ గిల్‌రాయ్, షారోన్‌ గోమనీ గ్రాన్‌ఉడ్, రాచెల్‌ వెబ్‌స్టార్‌లు ఉన్నారు.  వీరికి ఆంధ్రా హాస్పటల్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ జె. శ్రీమన్నారాయణ, కార్డియో థోరాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌ దిలీప్, కార్డియో అనస్థీషియా రమేష్‌ తమవంతు సహకారం అందించారు.




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement